సుమారు కోటిన్నర విలువ కలిగిన ఎర్రచందనం ను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాదీనo చేసుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సుమారు కోటిన్నర విలువ కలిగిన ఎర్రచందనం ను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాదీనo చేసుకున్నారు. తిరుపతి రెడ్ సాండర్ యాంటి-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సుఇంచార్జ్ ఎస్పి ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో ఎర్రచందనం అక్రమ రవాణపై ప్రత్యక బృందాలు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహించారు. గుట్టూరు ఫారెస్ట్ బీటు పరిధిలో బెంగళూరు - హైదరాబాదు నేషనల్ హై వే రోడ్డు దామాజి పల్లి గ్రామమునకు సమీపమున ఆర్.యస్.ఐ మురళీధర్ రెడ్డి వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేయగా.. ఇనోవా కారులో మొత్తం 84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు కేసు దర్యాప్తులో కడప జిల్లాకు చెందిన పాత ఎర్రచందనం స్మగ్లర్లు ప్రమేయము ఉన్నట్లు తేలిసింది. అరెస్టు చేసిన నిందితులను విచారణ జరపగా.. ఈ కేసులో సంబంధించి ఒక ఇనోవా కారును ప్రొద్దుటూరులో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో సంబంధించిన వారిపై లోతైన విచారణ జరుగుతుందిని, ఎర్ర చందనం స్మగ్గ్లింగ్ లో అలవాటు పడిన నేరస్తులను గుర్తించి వారిపై ఉక్కు పాదం మోపే చర్యలో భాగంగా పీడీ యాక్ట్ పెట్టి చట్ట పరంగా చర్యలు తీసుకోటామని ఎస్పీ తెలిపారు.