తెలంగాణలో హైదరాబాద్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది బిర్యాని. తెలంగాణకు చెందిన చాలామంది బిర్యాని అంటే ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ బిర్యానీలో చికెన్ బిర్యానీ, మటన్
న్యూస్ లైన్ డెస్క్:తెలంగాణలో హైదరాబాద్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది బిర్యాని. తెలంగాణకు చెందిన చాలామంది బిర్యాని అంటే ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ బిర్యానీలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఇలా అనేక రకాల బిర్యానీలు ఉంటాయి. ఇలా ఏ బిర్యానీ అయిన చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. మరి ఎలాంటి బిర్యానీ తిన్న మనం రకరకాల పానీయాలు తాగుతూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కూల్ డ్రింక్స్. మరి బిర్యానీ ఆరగిస్తూ కూల్ డ్రింక్స్ తాగడం మంచిదేనా. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
చాలామంది ఫుడ్ లవర్స్ కు బిర్యానీ తింటూ కూల్డ్రింక్స్ తాగడం అలవాటు ఉంటుంది. ఒకవైపు కూల్ డ్రింక్ తాగుతూనే మరోవైపు బిర్యానీ తింటూ ఉంటారు. ఈ విధంగా కూల్ డ్రింక్ తాగుతూ బిర్యాని తినడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కడుపు పట్టేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కొన్ని కొన్ని సందర్భాల్లో తేన్పులు ఎక్కువగా వచ్చి కూల్ డ్రింకులో ఉండే గ్యాస్ ముక్కులోకి ఎక్కే ప్రమాదం ఉంటుందని, ఇది ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.
అయితే బిర్యానీ తింటూ లేదంటే తిన్న వెంటనే కూల్డ్రింక్ మనం తాగడం వల్ల కడుపులో ఉండే ఎంజైమ్స్ సరిగ్గా పని చేయక తిన్న ఫుడ్డు కూడా సరైన పద్ధతిలో జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి బిర్యానీ ఆరగించిన తర్వాత కనీసం కొన్ని గంటల సమయం వేచిచూసి, కూల్ డ్రింక్స్ తాగడం మంచిదని అంటున్నారు. ఒకవేళ బిర్యానీ తింటూనే ఏదైనా పానీయం తాగాలని అనిపిస్తే మాత్రం ఫ్రూట్ జ్యూస్ లేదంటే పాయసం, మజ్జిగ తీసుకుంటే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.