భారత ప్రభుత్వం ..సైనికులు పడుతున్న కష్టానికి ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. భారత సైన్యంలోకి ఒంటెలను చేర్చుకుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ సరిహద్దులో నిత్యం పహారా కాస్తూ రక్షించే సైనికులు గురించి ఉంత మాట్లాడుకున్నా తక్కువే. ఎత్తైన పర్వత ప్రాంతాలు, గడ్డ కట్టే మంచు కొండల్లో ప్రయాణం చేస్తూ సైనికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సార్లు సరైన సదుపాయాలు ఉండవు. లద్దాఖ్ లో భారత సైన్యం రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం ..సైనికులు పడుతున్న కష్టానికి ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. భారత సైన్యంలోకి ఒంటెలను చేర్చుకుంది.
భారత సైన్యం సరిహద్దులో భద్రత ఇతర అవసరాల కోసం ఓంటెలు ను కొనుగోలు చేసింది. వాటి సేవలు ఉపయోగించుకుంటుంది. లద్దాఖ్ సరిహద్దులో పహారా కాసేందుకు, సామాగ్రి తరలించేందుకు లేహ్ లోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూట్ రీసెర్చ్ కు ఒంటెలను బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు. ఇవి పహారా కాసే సైనికుల బరువలు మోసేందుకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.
సరుకు రవాణాలో మెరుగ్గా పనిచేస్తాయని ఒంటెలు తీసుకున్నారట. ఆఱ్మీ లాజిస్టిక్స్ ఇతర అవసరాల కోసం ఈ జంతువులు చక్కగా ఉపయోగపడుతున్నాయి. లద్దాఖ్ సెక్టార్ లో పెట్రోలింగ్, బరువులు మోయడం వంటి పనుల కోసం బాక్ట్రియన్ బాగా ఉపయోగపడుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే ఈ ఒంటెలు యుద్ద సమయంలో ఏ మాత్రం బెదరకుండా సిబ్బంది ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఒంటెలే కాదు...జడల బర్రెను కూడా ట్రయల్స్ చేస్తున్నారు. క్లిక్ అయితే ఆర్మీలో జడల బర్రె కూడా చేరుతుందన్నమాట.