బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. 50 ఏళ్లలో ఆయన ఎన్నో రికార్డులు ఎన్నో హిస్టరీలు సాధించాడు. బాలక్రిష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ పండుగను చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు
న్యూస్ లైన్ డెస్క్: నందమూరి ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సీనియర్ హీరో ఎన్టీఆర్. ఆయన హీరో కాదు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. అలాంటి ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. అంతేకాదు ఇప్పుడు బాలకృష్ణ కొడుకు మోక్షాజ్ఞ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాంటి ఈ తరుణంలో బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి.
50 ఏళ్లలో ఆయన ఎన్నో రికార్డులు ఎన్నో రివార్డులు ఎన్నో హిస్టరీలు సాధించాడు. అలాంటి బాలక్రిష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ పండుగను చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. నందమూరి బాలకృష్ణ మొదటిసారి నటించిన సినిమా తాతమ్మకల. ఈ చిత్రం 1974 ఆగస్టు 30వ తేదీన థియేటర్లోకి వచ్చింది. రానున్న ఆగస్టు 30కి బాలకృష్ణ నటుడిగా ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు అన్నమాట. ఈ సందర్భంగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం గురించి పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సన్మానం చేయబోతోంది.
ఈ క్రమంలోనే తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి అయినటువంటి కేఎల్ దామోదర్ ప్రసాద్, అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు సినీ ప్రొడ్యూసర్ల మండలి కార్యదర్శి టి ప్రసన్నకుమార్, తెలుగు సినీ కార్మిక సమైక్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తాజాగా బాలకృష్ణని కలిసి సన్మాన వేడుకకు రమ్మని కోరుతూ ఆహ్వానం అందించారట. దీనికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి హైదరాబాదులో అంగరంగ వైభవంగా ఉత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట.
ఈ యొక్క సన్మాన వేడుకకు దేశంలోని అన్ని సినిమాల ఇండస్ట్రీలకు చెందినటువంటి ప్రముఖులు, హీరోలు హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు రాబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఆహ్వాన పత్రికను రూపొందించి ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణకు సంబంధించిన సినిమాలు రికార్డులు రాజకీయ నేపథ్యం, సామాజిక కార్యక్రమాల గురించి పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.