ఇండియా మొత్తంలో అట్టహాసంగా వినాయక ఉత్సవాలను బాలాపూర్ లో నిర్వహిస్తారు. ఇక్కడ లడ్డు వేలం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లడ్డువేలం అనేది జరుగుతూ ఉంటుంది. గత
న్యూస్ లైన్ డెస్క్: ఇండియా మొత్తంలో అట్టహాసంగా వినాయక ఉత్సవాలను బాలాపూర్ లో నిర్వహిస్తారు. ఇక్కడ లడ్డు వేలం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లడ్డువేలం అనేది జరుగుతూ ఉంటుంది. గత 30 ఏళ్లుగా సాగుతున్న లడ్డువేలం రికార్డు ధరలు కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది. ఆ విధంగానే ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డు రికార్డు ధరలో అమ్ముడై అందరి దృష్టిని ఆకర్షించింది.
2023లో బాలాపూర్ లడ్డు రికార్డు ధరగా 27 లక్షల రూపాయలు పలికింది. అయితే ఈసారి ఈ లడ్డు వేలం అనేది 1116 నుంచి మొదలై 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. కొలను ఫ్యామిలీ ఇప్పటికి చాలాసార్లు బాలాపూర్ లడ్డు కైవసం చేసుకున్నారు.
ఈసారి మరింత ఉత్సాహంగా వేలం ప్రక్రియలో పాల్గొని పోటీపడి లడ్డు కైవసం చేసుకున్నారు కొలను శంకర్ రెడ్డి. దీంతో ఉత్సవ కమిటీ కొలను శంకర్ రెడ్డి కి లడ్డును అందించి వారి కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో వినాయక ఉత్సవ కమిటీ కోరుకున్నారు.