ISKCON: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ !

బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువుల భద్రత పట్ల విదేశాంగ శాఖ అందోళన వ్యక్తం చేసింది. 


Published Nov 26, 2024 11:35:38 AM
postImages/2024-11-26/1732642438_chinmoykrishnadas17326410679801732641068221.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై భారత్ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువుల భద్రత పట్ల విదేశాంగ శాఖ అందోళన వ్యక్తం చేసింది. 


చిన్మయ్ కృష్ణ దాస్ ఓ ర్యాలీలో పాల్గొని బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారని అక్కడ మీడియా ప్రచురించింది. దీని వల్ల ఆయనను ఢోకా విమానాశ్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా నిరాకరించారు. దీని పై ఇండియన్ ఎంబసీ రియాక్ట్ అయ్యింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని భారత్ పేర్కొంది. 


బంగ్లాలో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయని, ఇలాంటి సమయంలోనే అరెస్ట్ ఘటన ఆందోళనకరమని భారత్ పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మైనార్టీ ఇళ్లలో దోపిడీలు, విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేసింది. అంతే కాదు ఇస్కాన్ అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ కు లేఖలు కూడా రాస్తున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu arrest bangladesh -iskcon-leader chinmoy-krishna-das

Related Articles