YADADRI: బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. బీర్ల కోసం ఎగబడుతున్న జనాలు..?

చాలా మందికి లోడ్ తో ఉన్న వెహికల్స్ తిరగబడిపోతాయి. అలాంటపుడు మాత్రం పెట్టుబడి పెట్టినవాడికి మాత్రం కన్నీళ్లే. జనాలు మాత్రం ప్రమాదాన్ని పక్కనబెట్టి మరీ దొరికింది దొరికినట్టు దోచుకుపోతారు.


Published Aug 01, 2024 01:48:45 PM
postImages/2024-08-01//1722500325_beerlorry.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : భారత్ లోనే కాదు..ఎక్కడైనా కామనే ప్రమాదాలు ..కాని అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు చాలా మందికి లోడ్ తో ఉన్న వెహికల్స్ తిరగబడిపోతాయి. అలాంటపుడు మాత్రం పెట్టుబడి పెట్టినవాడికి మాత్రం కన్నీళ్లే. జనాలు మాత్రం ప్రమాదాన్ని పక్కనబెట్టి మరీ దొరికింది దొరికినట్టు దోచుకుపోతారు.


యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. చౌటుప్పల్ మున్సిపల్ లోని లక్కారం స్టేజి దగ్గర విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ లారీ ఆగి పోయింది. అలా ఆగిన లారీని ..మరో లారీ ఫాస్ట్ గా వచ్చి గుద్దేసింది. ఈ రెండు లారీల్లో ఒకదాంట్లో ఉల్లిగడ్డ లోడు… మరో దాంట్లో బీర్లతో కూడిన  ఉన్నాయి. ఈ ప్రమాదంలో బీర్లన్ని రోడ్డు పాలయ్యాయి.


దీంతో వాటిని తీసుకునేందుకు జనం భారీగా ఎగబడ్డారు. ఇక మందుబాబులు అయితే బీరు బాటిళ్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరేసరికి జనాలు బీరు బాటిల్స్ అన్నీ ఎత్తుకుపోయే పనిలో ఉన్నారు. ట్రాఫిక్ జాం ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. 


కొన్ని సార్లు పెట్రోల్, డీజిల్ వంటివాటి కోసం ఎగబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. చాలా సార్లు ..పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో అందులోని పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ మంటలు చెలరేగి..దాదాపు 150 మంది చనిపోయారు. మరో ప్రాంతంలో జరిగిన పెట్రోల్ ప్రమాదంలో జనాలు ఎగబడి దాదాపు 42 మంది చనిపోయారు. దీంతో ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరారు పోలీసులు.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu vehicals

Related Articles