Bharateeyudu2:ఫ్లాప్ అయినా.. లాభపడింది ఎవరంటే.?

ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భారతీయుడు2 అలాంటి ఈ మూవీ ఈనెల 12వ తేదీన  థియేటర్లలోకి వచ్చింది.  విడుదలైన మొదటి రోజు నుంచే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో డైరెక్టర్ శంకర్ పై విపరీతమైనటువంటి  విమర్శలు వచ్చాయి. భారతీయుడు సినిమా ఏ విధంగా వచ్చిందో దానికి మించి భారతీయుడు2 ఉంటుందని చాలా ప్రచారం చేశారు.  థియేటర్లలోకి వెళ్లి చూసేసరికి అంతా షాక్ అయిపోయారు.


Published Jul 15, 2024 01:48:00 AM
postImages/2024-07-15/1721022224_bhara.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భారతీయుడు2 అలాంటి ఈ మూవీ ఈనెల 12వ తేదీన  థియేటర్లలోకి వచ్చింది.  విడుదలైన మొదటి రోజు నుంచే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో డైరెక్టర్ శంకర్ పై విపరీతమైనటువంటి  విమర్శలు వచ్చాయి. భారతీయుడు సినిమా ఏ విధంగా వచ్చిందో దానికి మించి భారతీయుడు2 ఉంటుందని చాలా ప్రచారం చేశారు.  థియేటర్లలోకి వెళ్లి చూసేసరికి అంతా షాక్ అయిపోయారు.

అసలు కథ బాగున్న దాన్ని తెరకెక్కించడంలో శంకర్ విపరీతంగా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కనీసం దీనికి రేటింగ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.  ఈ విధంగా సినిమా దారుణంగా విఫలమైందని చెప్పవచ్చు.  సినిమా వల్ల ప్రొడ్యూసర్లతో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు,  చాలా మునిగారు. కానీ ఈ సినిమా వల్ల లాభపడింది ఆ ఒక్క వ్యక్తి మాత్రమే.

ఆయన ఎవరో కాదు విశ్వ నటుడు కమలహాసన్. చిత్రానికి కమలహాసన్ రూ:75 కోట్ల పారితోషికం అందుకున్నాడట.  ఈ సినిమా వల్ల కేవలం ఆయన మాత్రమే లాభాల్లోకి వెళ్లి మిగతా వారంతా విపరీతంగా నష్టపోయారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ ప్రభావం మెగా హీరో రామ్ చరణ్ గేమ్ చేంజెర్ పై కూడా పడుతుందని ఆయన అభిమానులు భయపడుతున్నారు.  మరి చూడాలి గేమ్ చేంజర్   హిట్ కొడుతుందా? లేదంటే ప్లాప్ అవుతుందా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kamal-haasan bharathiyudu-2 shankar-director

Related Articles