Big boss8:హౌస్ లోకి హాట్ బ్యూటీ ఎంట్రీ..ఇక రచ్చ రచ్చే.!

బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా అందులో నుంచి బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అయింది. ఇదే


Published Sep 10, 2024 08:15:00 AM
postImages/2024-09-10/1725935977_jyothirai.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా అందులో నుంచి బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అయింది. ఇదే తరుణంలో  హౌస్ లోకి వచ్చిందే 14 మంది అందులో బేబక్క బయటకు వెళ్లడంతో  మరో కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. సాధారణంగా చాలా సీజన్స్ లో 18 నుంచి 20 దాకా కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకునేవారు. కానీ ఈసారి 14 మందిని తీసుకున్నారు.  

కానీ వీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ షో కాస్త రేటింగ్ తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో బేబక్కను బయటకు పంపిన బిగ్ బాస్ యాజమాన్యం  మరో హాట్ బ్యూటీని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించబోతున్నారని తెలుస్తోంది. ఆమె హౌస్ లోకి వచ్చిన తర్వాత అంత రచ్చ రచ్చే ఉంటుందని అంటున్నారు.  ఇంతకీ ఆ బ్యూటీ ఎవరయ్యా అంటే బుల్లితెర పాపులర్ నటి జ్యోతిరాయ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.  బిగ్ బాస్ స్టార్టింగ్ లోనే ఈమెను హౌస్ లోకి రావాలని బిగ్ బాస్ యాజమాన్యం అడిగిందట.

 కానీ ఆమెకు షూటింగ్స్ బిజీ వల్ల రాలేకపోయానని తెలియజేసింది. దీంతో ఆమెను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే జ్యోతి రాయ్ బుల్లితెరపై "గుప్పెడంత మనసు" వంటి సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.  అంతేకాదు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను పిచ్చిపిచ్చి చేస్తుంది.  అలాంటి గీతురాయ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం అంత రచ్చ రచ్చే బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna big-boos8 bejavada-bebakka pruthiraj aakula-sonia jyothi-rai

Related Articles