Big Boss8: హౌస్ లోకి నందమూరి హీరో ఎంట్రీ.. ఎవరంటే.?

బిగ్ బాస్  తెలుగు ఇండస్ట్రీలో రియాలిటీ షోలలో ఎంతో అద్భుతంగా దూసుకుపోతున్న షో. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో  త్వరలో 8వ సీజన్ కూడా ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే


Published Aug 14, 2024 09:21:00 PM
postImages/2024-08-14/1723648375_bigboss.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్  తెలుగు ఇండస్ట్రీలో రియాలిటీ షోలలో ఎంతో అద్భుతంగా దూసుకుపోతున్న షో. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో  త్వరలో 8వ సీజన్ కూడా ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇదే తరుణంలో ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వస్తున్నాయి.  దీంతో ఇందులోకి ఎవరెవరు వస్తున్నారు అనేది చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

ఇదే తరుణంలో బిగ్ బాస్ లోకి ఒక హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో కూడా ఆషామాషీ హీరో కాదు నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే చైతన్య కృష్ణ.  నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు హీరోగా దమ్ మూవీలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తర్వాత బ్రీత్ అనే చిత్రంలో కూడా నటించారు.

ఇలా హీరోగా ఈయన ఒక సినిమా చేసిన అంతగా ఆదరణ లభించలేదు. అలాంటి ఈ హీరో ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారట. అయితే ఈ విషయం అధికారికంగా బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  ఇప్పటికే బిగ్ బాస్ నుంచి పలు ప్రోమోలు రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  ఇక వీళ్లే కాకుండా యాదమ్మ రాజు, కిర్రాక్ ఆర్పి, సింగర్ సాకేత్,  వేణు స్వామి, నిఖిల్, విష్ణు ప్రియ, రీతు చౌదరి, వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna venuswamy big-boos8 chaitanya-krishna

Related Articles