Big boss8: బేబక్క ఎలిమినేట్..కారణం వరదలేనా.?

బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఒక వారం గడిచిపోయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మొదటి వారంలో బెజవాడ బేబక్క అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయింది. మరి బేబక్క ఎందుకు ఎలిమినేట్


Published Sep 09, 2024 09:30:00 AM
postImages/2024-09-09/1725853199_bebakka.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఒక వారం గడిచిపోయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మొదటి వారంలో బెజవాడ బేబక్క అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయింది. మరి బేబక్క ఎందుకు ఎలిమినేట్ అయింది ఆ కారణాలేంటి వివరాలు చూద్దాం.. బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం నుంచే అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో  అనేక ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఇంతకు ముందు ఏడు సీజన్స్ ఒక లెక్క అయితే ఎనిమిదో సీజన్ మరో లెక్క అంటూ నాగార్జున చెప్పినట్టుగానే  హౌస్ లో వ్యవహారం నడుస్తోంది.

అయితే ఈ వారం వచ్చిన రెండు రోజులకే నామినేషన్ ప్రారంభమై మూడు గొడవలు, ఆరు కొట్లాటలుగా తయారైంది. ఇదే తరుణంలో ఒకరికొకరు పోటీపడి నామినేషన్లలో నాగమణికంఠ, విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, సోనియాఆకుల, శేఖర్ బాషా, పృథ్వీరాజ్ నిలిచారు. అయితే మూడు రోజుల పాటు సాగిన ఓటింగ్ లో  బెజవాడ బేబక్కకు ఓటింగ్ తక్కువగా పడటం వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇందులో అత్యధికంగా విష్ణు ప్రియకు 30 శాతం ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నాగమణికంఠ 27%రెండవ స్థానంలో ఉన్నారట. అలాగే పృథ్వీరాజ్ కు 13 శాతం ఓట్లతో  నాలుగవ స్థానానికి చేరుకున్నాడు.

ఇక ఆకుల సోనియా 10 శాతం ఓట్లు, శేఖర్ భాషా కు 10 శాతం ఓట్లు పడ్డాయి. చివరి స్థానంలో  బెజవాడ బేబక్క ఉండడం వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయింది. బేబక్క హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి కాస్త నెగిటివిటీ సంపాదించుకుంది. అయితే ఆమె గేమ్ పరంగా బాగానే ఉంది కానీ, జనాలు అంతగా ఆమెను ఆదరించలేదు. బేబక్క ప్రధానంగా ఎలిమినేట్ అవ్వడానికి కారణం  బెజవాడ వరదలే అని చెప్పవచ్చు. ప్రస్తుతం విజయవాడలో అత్యధిక వరదల కారణంగా విద్యుత్ సమస్య ఏర్పడింది. దీనివల్ల ప్రజలు  అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత వారం నుంచి వారు టీవీలకు దూరం అయిపోయారు.

దీనివల్ల వారి సొంత గడ్డపై వచ్చినటువంటి  బేబక్కకు సపోర్ట్ లేకుండా అయిపోయింది. ఒకవేళ బెజవాడలో వరదలు రాకుంటే బేబక్కకు బెజవాడ మొత్తం సపోర్ట్ చేసేవారు. దీనివల్ల ఆమె ఓటింగ్ పెరిగి ఎలిమినేట్ అయి ఉండేది కాదు. ఆ స్థానంలో తప్పకుండా శేఖర్ భాష లేదంటే ఆకుల సోనియా ఉండేది. బ్యాడ్ లక్  వరదలు బేబక్కను హౌస్ నుంచి బయటకు రప్పించాయని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.  ఏది ఏమైనా బేబక్క బయటకు రావడం బెజవాడ వారిని బాధిస్తోందని తెలుస్తోంది. అయితే బేబక్క పాపులర్ యూట్యూబర్. ఈమె అసలు పేరు మధు నెక్కంటి. సోషల్ మీడియాలో 1.64కే ఫాలోవర్స్ ఉన్నారు. మరి బేబక్క హౌస్ లోకి వచ్చాక మరో 20వేల ఫాలోవర్స్ పెరిగారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bigg-boss-8 naga-manikanta bejawada-bebakka aakula-sonia prithvi-raj biggboss-6-1st-week-elimination

Related Articles