విశ్వనటుడు కమల్ హాసన్ , అగ్రదర్శకుడు శంకర్ కాంభినేషన్ లో " భారతీయుడు -2" చిత్రం ఈ నెల 12న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ లో భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాత సుభాస్కరన్, యువ హీరో సిద్ధార్థ్, సముద్రఖని, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, హస్యనటుడు బ్రహ్మానందం చాలా మంది హాజరయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విశ్వనటుడు కమల్ హాసన్ , అగ్రదర్శకుడు శంకర్ కాంభినేషన్ లో " భారతీయుడు -2" చిత్రం ఈ నెల 12న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ లో భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాత సుభాస్కరన్, యువ హీరో సిద్ధార్థ్, సముద్రఖని, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, హస్యనటుడు బ్రహ్మానందం చాలా మంది హాజరయ్యారు.
కమల్ హాసన్ ఎదురుగానే బ్రహ్మానందం ఆయన్ని ఇమిటేట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. కమల్‌హాసన్‌లా మాట్లాడిన బ్రహ్మానందం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు నాట..కమల్ హాసన్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో తెలుసు కదా.. " ఇండియన్ -2 " రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తే నేను చాలా సంతోషిస్తున్నాను. అని కమల్ వాయిస్ లో బ్రహ్మానందం మాట్లాడారు.ఈ స్పీచ్‌ను లోకనాయకుడు కూడా ఎంజాయ్ చేయడం వీడియోలో కనిపించింది.
కాలేజీలో చదువుకునే రోజుల్లో అందరూ ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్‌లను ఇమిటేట్ చేస్తే తాను మాత్రం కమల్ వాయిస్‌ను మిమిక్రీ చేసేవాడినని అన్నారు. రీసెంట్ గా ఉన్నపుడు...నటి శృతిహాసన్ ముందు మిమిక్రీ చేస్తే భలే హ్యాపీగా ఫీలయ్యారని ...సేమ్ కమల్ లాగే మాట్లాడుతున్నారని శృతి అందట. ఇలా కాంప్లిమెంట్స్ వచ్చే సరికి మరింత ధైర్యం వచ్చేసింది.
#Brahmanandam gaaru Imitating #KamalHassan ❤️#Bharateeyudu2 #KamalHaasan pic.twitter.com/34id3MOoVL — Milagro Movies (@MilagroMovies) July 7, 2024