ఒకప్పుడు ఆర్టిస్టుల విషయం లో డైరక్టర్స్ పర్టిక్యులర్ గా ఉండేవారు. ఇపుడు కథ రాసుకునేటపుడే ..ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్ పేర్లు రాసుకుంటున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బ్రహ్మాజీ ఎవరికి తెలీదు చెప్పండి.ఎప్పుడో సింధూరం సినిమా నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాల వరకు చాలా మంది డైరక్టర్స తో పని చేశాడు రీసెంట గా ఓ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు . "నేను హీరోను కావాలని ఇండస్ట్రీకి రాలేదు. అందువలన నా కెరియర్ విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఒకప్పుడు ఆర్టిస్టుల విషయం లో డైరక్టర్స్ పర్టిక్యులర్ గా ఉండేవారు. ఇపుడు కథ రాసుకునేటపుడే ..ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్ పేర్లు రాసుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో నేను ఒక తెలుగు సినిమా చూశాను. ఆ సినిమాలో తెలుగువాళ్లను వెతుక్కోవలసి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఆడాలి కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఆర్టిస్ట్ లను తీసుకుంటున్నారు. తెలుగు ఆర్టిస్టులే ఉండడం లేదు. హీరో తర్వాత ఏ క్యారక్టర్ అయినా తమిళ .. మలయాళ ..హిందీ ఆర్టిస్టులతో చేయించారు.
తెలుగు సినిమాల్లో తెలుగు ఆర్టిస్ట్ లు ఉండడం లేదు. అది నాకు చాలా బాధను కలిగించింది. అలాంటప్పుడు ఆ సినిమాను వేరే భాషలో తీసి ఇక్కడ డబ్ చేసుకోవచ్చును గదా అనిపించింది. అందుకే తెలుగువాళ్లకి ఛాన్సులు ఇవ్వండి అంటూ ఇటీవల మాట్లాడటం జరిగింది" అని చెప్పారు.