దీంతో రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను 95429 08025 నంబర్ తో ఏర్పాటు చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా వైరస్ సోకి కోళ్లు చనిపోతున్న ఘటనలపై నిపుణులు నిగ్గు తేల్చారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ చేశారు. అంతే కాదు తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్ని రోజులుగా వైరస్ సోకి కోళ్లు చనిపోతున్న ఘటనలపై నిపుణులు తేల్చారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు.పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణె ల్యాబ్‌లో నిర్ధారణ అయింది. దీంతో రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను 95429 08025 నంబర్ తో ఏర్పాటు చేశారు.
బర్డ్స్ చనిపోతున్నా ..చనిపోయిన బర్డ్స్ ను అమ్ముతున్నట్లు తెలసినా వెంటనే అధికారులకు సమాచారాన్ని అందించాలనీ హై అలర్ట్ జారీ చేశారు. కొన్ని రోజులు ప్రజలు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదని జిల్లా కలక్టర్ ప్రశాంతి హెచ్చరికలు జారీ చేశారు. రీసెంట్ గా కోనసీమ చాలా ప్రాంతాలలో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్కో ప్రౌల్టీ ఫాంలో రోజుకు 10వేలకు పైగా మృతి చెందుతున్నాయి.
కానూరు శాంపిల్స్ కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్. పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా విధించారు. ఇప్పటికే 75 శాతం కోళ్లను , గుడ్లను కాల్చేశారు ఫౌల్ట్రీ యజమానులు . చాలా ప్రాంతాల్లో కోళ్ల శాంపిల్స్ కు ఇంకా రిపోర్ట్స్ రావల్సి ఉంది.