అంతేకాదు తెలుగు , తమిళం, కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో కూడా ఈ మూవీ సాంగ్ రిలీజ్ అయ్యింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మంచు ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీ కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మూవీ టీం. శివ శంకర్ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ విడుదల చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు తెలుగు , తమిళం, కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో కూడా ఈ మూవీ సాంగ్ రిలీజ్ అయ్యింది. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి ప్రభాస్ మోహన్ బాబు , విష్ణు లాంటి వారందరి లుక్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పై అభిమానులకు , భారీ అంచనాలు . మహాభారతం డైరక్టర్ డైరక్షన్ లో సినిమా రావడం ఒకెత్తు అయితే మంచు ఫ్యామిలీ భారీ ఖర్చుతో తీస్తున్న సినిమా కావడం మరో విశేషం.తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ లో మంచు విష్ణు అద్భుతంగా నటించారు.
\