ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చారు. గోవింద, నరసింహ నామస్మరణలతో రథాన్ని భక్తులు లాగారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. కళ్యాణోత్సవంలో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ మొగల్తూరు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ తొలిపూజ చేసి స్వామి వారి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయం నుంచి స్వామి-అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఉంచి.. ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చారు. గోవింద, నరసింహ నామస్మరణలతో రథాన్ని భక్తులు లాగారు.