వారిద్దరు ఈ సినిమాలో తాత-మనవళ్లుగా యాక్ట్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బ్రహ్మానందం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ టీం. హీరో ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆయన కుమారుడు రాజా గౌతమ్ , బ్రహ్మానందం ఈ సినిమాలో నటిస్తున్నారు. వారిద్దరు ఈ సినిమాలో తాత-మనవళ్లుగా యాక్ట్ చేస్తున్నారు.
ట్రైలర్‌లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ మధ్య డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ లో కామెడీ ఒక్కటే కాదు సెంటిమెంట్ ను కూడా చూపించారు. రాజా గౌతమ్ పోషించిన క్యారక్టర్ మధ్య ప్రేమను ఈ ట్రైలర్ హైలైట్ చేస్తుంది.ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రాహుల్ యాదవ్ నక్కా ఈ మూవీని నిర్మించారు.ఈ నెల 14న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
తాత ఆస్తిని పొందేందుకు సినిమాలో ఆయన మనవడు ఏం చేశాడన్నదే సినిమా స్టోరీ లైన్ . పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా మేకింగ్ జరిగింది. దీంతో లొకేషన్స్ చాలా అందంగా కనిపిసతున్నాయి. అంతే కాదు సినిమాకు తగ్గట్లు సీన్లు , లొకేషన్స్ చాలా అధ్భుతంగా కుదిరాయంటున్నారు నెటిజన్లు.