Ed Sheeran: చుట్టమల్లే పాట పాడిన పాప్ సింగర్ !

పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టొఫర్ షీరన్ ను థాంక్స్ చెప్పారు. బ్రిడన్ కు చెందిన షీరన్ ఇటీవల బెంగళూరులో కాన్సర్ట్ నిర్వహించారు.


Published Feb 10, 2025 01:35:00 PM
postImages/2025-02-10/1739174812_cr20250210tn67a9ab1f01bb7.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేవర సినిమాలోని " చుట్టమల్లే " పాటను  ఓ పాప్ సింగర్ స్టేజీ మీద పాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. జూ . ఎన్టీఆర్ కూడా స్పందించారు. మ్యూజిక్ కు మ్యాజిక్ చెయ్యడం తప్ప...హద్దులు లేవని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చారు. పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టొఫర్ షీరన్ ను థాంక్స్ చెప్పారు. బ్రిడన్ కు చెందిన షీరన్ ఇటీవల బెంగళూరులో కాన్సర్ట్ నిర్వహించారు.

సండే జరిగిన ఈవెంట్ లో ఎందుకు పుట్టింద పుట్టింది అంటూ ఆయన తెలుగులో పాడారు. శిల్పారావుతో గొంతు కలిపారు. ఇద్దరు పాట పాడుతుండగా ఆడిటోరియం దద్దరిల్లింది. ఆడియన్స్ కోరస మధ్యలో "ఆ"  అంటూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు.  బ్రిటీష్ యాసతో షరీన్ నోట చుట్టమల్లే పాట డిఫరెంట్ గా వినిపించింది. కాగా, ఈ వీడియోను చూసి నెటిజన్లు షీరన్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. పాప్ సింగర్ నోట తెలుగు పాట వినడంతో ప్రేక్షకులు సంతోషంతో కేకలు వేశారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వ్యూస వస్తున్నాయి.

 

Related Articles