మీరు టెన్షన్ పడి...మీ పిల్లల్ని టెన్షన్ పెట్టకండి. త్వరలో జరగనున్న పది, ఇంటర్ పరీక్షల కోసం కొన్ని సూచనలు తెలుసుకుందాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా అని పేరెంట్స్ ను అడుగుతున్నారేంటి..అంటారా ..అసలు మీ వల్లే కదా ...పరీక్షలు రాసేవాళ్లు మరింత టెన్షన్ పడిపోతారు. మీరు టెన్షన్ పడి...మీ పిల్లల్ని టెన్షన్ పెట్టకండి. త్వరలో జరగనున్న పది, ఇంటర్ పరీక్షల కోసం కొన్ని సూచనలు తెలుసుకుందాం.
* వారి చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ముఖ్యమైన బాధ్యత. కాబట్టి వారికి అనుగుణంగా మీ షెడ్యూల్ చేసుకొండి. మీ సిరియల్స్ , మీ టీవీ షోస్ అన్నీ ఆపేయండి. వారికి చదువుకునే అవకాశం కల్పించండి.
* వారికి ఏ టైంలో చదవాలనుకుంటే ఆ టైంలో చదవనివ్వండి. వారికి టెన్షన్ నిద్ర రాకపోతే మీరు సర్ధిచెప్పండి. అంతేకాదు అలా చదువుతున్నావేంటి..ఇలా చదువతున్నావేంటి అని భయపెట్టకండి.
* పరిక్షల్లో ఆరోగ్యం పాడెయ్యెలా ఎలాంటి ఫుడ్స్ పెట్టకండి.
* పిల్లలు చదువుకునే సమయంలో పెద్దలు ఫోన్ చూస్తూ లేదా మాట్లాడుతూ కాలక్షేపం చేయడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మీరు పార్టీలు , ఫంక్షన్లు మానుకొండి. వారికి కూడా వెళ్లలనుకుంటే వారికి కూడా తిరగాలనిపిస్తుంది.
* ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం తప్పుగా రాయొద్దు, చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నావ్ అని పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు. గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. టెన్షన్ పెడితే స్కోర్ పాడవుతుంది. సో మీరు వీటికి ప్రిపేర్ అయితే మీ పిల్లలు పరీక్షలు బాగా రాస్తారు.