Bread masala: మ్యాగీ కంటే ఈజీగా అయిపోయే ఈ బ్రెడ్ స్నాక్ ట్రై చెయ్యండి !

అసలే వర్షాలు ..వేడి వేడి గా నిప్పులు పెట్టిన ఊదుకుంటూ తినేయాలనిపిస్తుంటుంది. కాని లేచి బజ్జీలు , వడలు వేసుకునేంత ఓపిక ఉండదు.


Published Aug 31, 2024 12:09:00 AM
postImages/2024-08-31/1725043218_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలే వర్షాలు ..వేడి వేడి గా నిప్పులు పెట్టిన ఊదుకుంటూ తినేయాలనిపిస్తుంటుంది. కాని లేచి బజ్జీలు , వడలు వేసుకునేంత ఓపిక ఉండదు. లేజీగా కూడా ఉంటుంది. అందుకే మీకోసం మ్యాగీ కంటే ఈజీగా అయిపోయే ఈ స్పైసీ బ్రెడ్ స్నాక్ చూసేద్దాం రండి. మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తీసుకొండి.

బ్రెడ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు:
5 కప్పుల బ్రెడ్ ముక్కలు లేదా 6 బ్రెడ్ స్లైసులు

2 చెంచాల నూనె లేదా బటర్

అరచెంచా అల్లు వెల్లుల్లి ముద్ద

రెండు పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు

1 పెద్ద ఉల్లిపాయ, సన్నటి తరుగు

2 టమాటాలు, సన్నటి ముక్కలు

అరచెంచా పసుపు

అరచెంచా కారం

అరచెంచా కసూరీ మేతీ

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా గరం మసాలా

అరచెంచా ఉప్పు

గుప్పెడు కొత్తిమీర తరుగు

1 నిమ్మకాయ

బ్రెడ్ మసాలా తయారీ విధానం:


బ్రెడ్ ముక్కలు అంచులు కట్ చేసేసుకొని ఉంచుకొండి. నూనె లేదా బటర్ వేసుకోవాలి. వేడెక్కాక ఉల్లి, మిర్చి ,అల్లం , వెల్లుల్లి లాంటివి పచ్చి వాసన పోయే వరకు వేపుకొండి. కాసింత టమోటా సాస్ వేసి వేపుకొండి. లైట్ కొత్తిమేర వేసుకొని కాసేపు మగ్గించండి.దీంట్లో ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు బ్రెడ్ ఆ కర్రీలో కాస్త మెత్తబడనివ్వండి.దాంతో అవి కాస్త కరకరలాడుతూ రుచి బాగుంటాయి. వాటిని మసాలాలో కలిపి వెంటనే స్టవ్ కట్టేయాలి. ఇంతే పిల్లలకు అయితే ఇంకా నచ్చుతుంది. బ్రెడ్ వద్దనుకుంటే ...చపాతీ కూడా వేసుకోవచ్చు. లేదా గట్టిగా వేయించుకున్న పూరీలకు ఈ కూరను స్టఫ్ లా కూడా తినచ్చు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news healthy-food-habits junk-food tasty-food-

Related Articles