తన కుటుంబం కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. తన సోదరుడు చనిపోతే ..తన పిల్లల ఆలనా పాలనా చూసుకున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు. బెంగాల్ కు చెందిన 64 ఏళ్ల రైతు . అంత వయసులోనూ మాస్టర్స్ చెయ్యాలనే పట్టుదలతో అందరిని ఆశ్చర్యపరిచాడు. వ్యవసాయం చేస్తూనే చదువును కొనసాగించాడు. నదియా జిల్లాలోని లక్ష్మీనాథ్ పుర్ కు చెందిన బిశ్వనాథ్ ప్రామాణిక్ పేదకుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చదువుకోవాలనున్నా ఆర్ధిక కష్టాల మధ్య కుదరలేదు. తన కుటుంబం కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. తన సోదరుడు చనిపోతే ..తన పిల్లల ఆలనా పాలనా చూసుకున్నాడు.
ఇక వాళ్ల పిల్లలు పెద్దవాళ్లయ్యాక మళ్లీ చదువుకోవడం మొదలుపెట్టాడు. వ్యవసాయం చేస్తూ తన చదువును కంటిన్యూ చేశాడు. ఖాళీ సమయాల్లో చదవి హయ్యర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత బిశ్వనాథ్కు చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. నేతాజీ సుభాశ్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను సంప్రదించాడు. ఓపెన్ డిగ్రీ చేశాడు. 2024 ఎంఏ బెంగాలీ భాషలో 66 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. ఇప్పుడు పీహెచ్ డీ చెయ్యాలని భావిస్తున్నాడు. 64 ఏళ్ల వయసులో పీహెచ్ డీ చెయ్యలన్న బిశ్వనాథ్
బిశ్వనాథ్ కు రాని పని లేదు. వెహికల్ రిపేర్లు , తాపి మేస్త్రీ పని , వ్యవసాయం ఇలా అన్ని పనులు చేస్తాడు. అందుకే గ్రామస్థులు బిశ్వనాథ్ ను విశ్వకర్మ అని పిలుస్తారట. ఖాళీ టైంలో పుస్తకాలు చదువుతాడు. తనను చూసి ... చాలా మంది చదువుకోవడానికి ముందుకు వస్తున్నారంటున్నారు గ్రామస్థులు.