Singer Kalpana: సింగర్ కల్పన ఆరోగ్యం పై డాక్టర్లు ఏమన్నారంటే !

కల్పన ఆరోగ్య పరిస్థితి పై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే కల్పన నిద్రమాత్రలు మింగారని వైద్యులు తెలిపారు.


Published Mar 05, 2025 12:11:00 PM
postImages/2025-03-05/1741157007_cr20250305tn67c7a49bec4ae.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం గా మారింది. ప్రస్తుతం కల్పన హైదరాబాద్ నిజాంపేట ప్రాంతంలోని హోలిస్టిక్ హాస్పటిల్ లో చికిత్స పొందుతున్నారు. కల్పన ఆరోగ్య పరిస్థితి పై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే కల్పన నిద్రమాత్రలు మింగారని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఎక్కువగా నీరు చేరడంతో ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అదిస్తున్నామని వెల్లడించారు. ఆమెకు ఇన్ఫెక్షన్ ఉందని ఆక్సిజన్ అందిస్తున్నామని ...ప్రమాదం ఏం లేదని ,...ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health sleeping kalpaka,

Related Articles