రాజమండ్రిలో నటి నటి జయప్రద సోదరుడు రాజబాబుకు పిండప్రదానం జరిగింది. గోదారి ఒడ్డున ఈ కార్యక్రమం జరగగా జయప్రద దీనికి హాజరయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సినీ నటి జయప్రద తమ్ముడు చనిపోయిన సంగతి తెలిసిందే. జయప్రద సినిమాలకు దూరంగా ఉంటుంది. తను రాజమండ్రిలోనే పుట్టి పెరిగింది. తన సోదరుడు రాజమండ్రిలోనే ఉంటున్నాడు. తాజాగా నేడు రాజమండ్రిలో నటి నటి జయప్రద సోదరుడు రాజబాబుకు పిండప్రదానం జరిగింది. గోదారి ఒడ్డున ఈ కార్యక్రమం జరగగా జయప్రద దీనికి హాజరయ్యారు.
రాజబాబు కుమారుడు సామ్రాట్ తన తండ్రికి పిండప్రధానం చేసాడు. అనంతరం జయప్రద, సామ్రాట్ కలిసి గోదావరిలో అస్థికలు కలిపారు. జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. రాజబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. నేను రాజమండ్రికి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడు. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉందని ..ఈ రోజు ఏడో రోజు రాజమండ్రి గోదారి లో తన ఆస్థికలు కలిపినట్లు తెలిపారు. ఆ గోదారమ్మ తన తమ్ముడికి మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. మా తమ్ముడు కుమారుడు సామ్రాట్ తో ఈ కార్యక్రమాన్ని చేయించాను అని తెలిపింది.ఈ కార్యక్రమంలో తమ్ముడికి పిండ ప్రదానం చేస్తుండగా జయప్రద ఎమోషనల్ అయింది. తన అల్లుడు సామ్రాట్ ని పట్టుకొని ఏడ్చింది జయప్రద.