మైసూరులో కీలకమైన యాక్షన్ సీన్ ఘాట్ చేస్తున్న టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే కార్తీని దగ్గర్లో ఉన్న హాస్పటిల్ కు తరలిచింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తమిళ్ స్టార్ హీరో కార్తీ ..సర్దార్ 2 సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన కాలికి గాయమైంది . మైసూరులో కీలకమైన యాక్షన్ సీన్ ఘాట్ చేస్తున్న టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే కార్తీని దగ్గర్లో ఉన్న హాస్పటిల్ కు తరలిచింది చిత్రయూనిట్ . ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాగా, వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కార్తీకి డాక్టర్లు సూచించారట. కార్తీ కోలుకోవడానికి వారం రోజులు టైం పడుతుందని చెప్పారట. ఈ ఘటనతో మరో సారి సర్ధార్ 2 మూవీ షూటింగ్ ని ఆపేశారు. హీరో కార్తీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ ఫ్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. సర్దార్ 2 డైరక్టర్ పీఎస్ మిత్రన్ రజిశా విజయన్ , ఎస్ జే సూర్య, మాళవికా మోహనన్ , ఆషికా రంగనాథ్ ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు.