నాన్ వెజ్ లవర్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్ . మాంసాహార ప్రియులకు ఈ శ్రావణ మాసం భలే వర్కవుట్ అవుతుంది. చికెన్ రేటు భారీగా తగ్గింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాన్ వెజ్ లవర్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్ . మాంసాహార ప్రియులకు ఈ శ్రావణ మాసం భలే వర్కవుట్ అవుతుంది. చికెన్ రేటు భారీగా తగ్గింది. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. అందులోను శ్రావణ మాసం కారణంగా నాన్ వెజ్ రేట్లు భారీగా తగ్గినట్టు తెలిపారు వ్యాపారులు.
ఇప్పటి వరకు దాదాపు కేజీ చికెన్ ధర 280 నుంచి 300 వందల రూపాయిలు ఉండేది. ఇప్పుడు చికెన్ ధర దాదాపు 180 రూపాయిలు ఉంటుందని తెలిపారు. అంతేకాదు శ్రావణ మాసం ఎఫెక్ట్ తో చికెన్ మరింత తగ్గే అవకాశముందంటున్నారు వ్యాపారస్థులు . గతనెల్లో రూ.7 పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.6 నుంచి రూ.6.50 ధర పలుకుతోంది. హోల్సేల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.5.50 ధర పలుకుతోంది.
చికెన్ 180 కంటే మరింత తగ్గితే ఫౌల్టీ యజమానులు దీంతో పౌల్టీ నిర్వాహకులు భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు. అయితే శ్రావణ మాసం , వినాయకచవితి, ఇలా వరుస పెట్టి పండుగలు..మంచి రోజులు కారణంగా రానున్న మూడు నెలలు చికెన్ రేట్లు తక్కువ గానే ఉంటాయంటున్నారు వ్యాపారులు.