Vijay shanthi: బంగ్లాదేశ్ సంక్షోభంపై విజయశాంతి ఏమన్నారంటే

బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి హసీనా తప్పుకున్న అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దారుణాతి దారుణమైన పరిణాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


Published Aug 11, 2024 09:07:38 PM
postImages/2024-08-11/1723390658_vijayshanti.PNG

న్యూస్ లైన్ సినిమా: బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి హసీనా తప్పుకున్న అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దారుణాతి దారుణమైన పరిణాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. హిందువులు, హిందువుల ఆస్తులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరాల వీడియోలు చూసి ఎవరైనా తల్లడిల్లే పరిస్థితులు ఉందన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన పరిణామాలు అని తెలిపారు. అదే సమయంలో అక్కడ కేవలం హిందువులనే గాక మాజీ ప్రధాని హసీనా పార్టీ అవామీ లీగ్‌కు చెందిన చెందిన అనేకమంది హత్యకు గురయ్యారు. వారి ఇళ్లు, వ్యాపార సంస్థలు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 

నటుడు, నిర్మాత అయిన ఇద్దరు తండ్రీ కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరూ ముస్లింలే.. ఎవరెవరిపైనో ఎవరెవరికో ఉన్న పాత కక్షలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు, ఇంకెందరో తమ అగ్రహావేశాలు ప్రదర్శించేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై ఆ దేశంలో పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని హిందూ విద్వేష ఉగ్రవాద శక్తులు కూడా అందులోకి చొరబడ్డాయి. ఆ నిరసనల మాటున హిందూ విద్వేషాన్ని ఈ మారణకాండ రూపంలో వెల్లడించాయి. ఉగ్రవాదాన్ని ద్వేషిద్దాం.. పై సంఘటనలను తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిద్దామని విజయశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు.

newsline-whatsapp-channel
Tags : india-people congress vijaya-shanti pm-modi bangladesh

Related Articles