సేమియా పాయసం అంటే చాలా మందికి ఇష్టం . పాలు పంచదారతో పాటు ఈ వంటకాన్ని ఇష్టంగా కూడా తింటారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : సేమియా పాయసం అంటే చాలా మందికి ఇష్టం . పాలు పంచదారతో పాటు ఈ వంటకాన్ని ఇష్టంగా కూడా తింటారు. అయితే ఇప్పుడు సీతాఫలం సీజన్ . ఎటు చూసినా సీతాఫలాలే. రేటు తక్కువగానే ఉన్నాయి. సో సీతాఫలంతో ఈజీ చేసే సేమియాను తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
సీతాఫలం గుజ్జు - 1 కప్పు
పాలు - అర లీటర్
సేమియా - 1 కప్పు
జీడిపప్పు - 6 టేబుల్ స్పూన్లు
యాలకులు -3
కండెన్స్డ్ మిల్క్ - 1 కప్పు
నెయ్యి - తగినంత
తయారీ విధానం:
ముందుగా ఓ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, యాలకులు వేసి నీళ్లు పోసి ఓ గంట సేపు నానబెట్టి పేస్ట్ చేసుకొని ఉంచుకొండి. ఇఫ్పుడు సీతాఫలాన్ని ముగిన పండుని తీసుకొని గుజ్జును సెపరేట్ గా చేసుకొండి. ఈ గుజ్జు మీరు వాడే వెజ్ కటర్ లో వేస్తే ఈజీ గా వస్తుంది.. ఇలా మొత్తంగా ఒక కప్పు గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులోకి మిగిలిన జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
పాన్ లో సేమియా వేసుకొని...అదే పాన్‌లో పాలు పోసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించండి. కాస్త సేమియా ఉండికిన తరువాత మీరు ముందుగా కాజు పేస్ట్ చేసుకున్నారుగా అది వేసుకొని కలుపుకొండి. మీకు కావాలంటే రెండు స్పూన్స్ చక్కెర వేసుకొండి. లేదంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకొండి.
సుమారు 40 నిమిషాల తర్వాత అంటే సేమియా పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత సీతాఫలం గుజ్జు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని వేడిగా కంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని కూల్‌గా ఉన్నప్పుడు తింటే ఆ ఫీలింగ్ వేరే లెవల్.