భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ.. బాలీవుడ్, హాలీవుడ్ లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి దీపికా పడుకునే. సౌత్ లో కూడా దీపికా భారీగానే క్రేజ్ సంపాదించింది.
న్యూస్ లైన్ డెస్క్ : దీపం ఉన్నప్పుడే ఇల్ల చక్కబెట్టుకోవాలన్నారు పెద్దలు. మిగతా రంగాల్లో ఏమో గానీ.. సినిమా రంగంలో మాత్రం ఈ సూత్రాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తుంటారు. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. భారీగా ఆస్తులు వెనకేసుకుంటున్నారు సినీ తారలు. అయితే ఈ విషయంలో హీరోల సంగతి అటుంచితే.. హీరోయిన్లు మాత్రం దూసుకుపోతున్నారు. అటు సినిమాలు.. ఇటు ఇతర బిజినెస్ లతో హీరోల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. ఇక భార్యభర్తలిద్దరూ హీరోహిరోయిన్ అయిన జంటల్లో సైతం భర్తల కంటే భార్యలే ఎక్కువ సంపాదిస్తున్నారట.
భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ.. బాలీవుడ్, హాలీవుడ్ లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి దీపికా పడుకునే. సౌత్ లో కూడా దీపికా భారీగానే క్రేజ్ సంపాదించింది. రీసెంట్ గా కల్కీ మూవీతో మరో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు దీపికా 20కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. దీంతో పాటే బ్రాండ్ ప్రమోషన్లూ చేస్తోంది. ఒక్కో యాడ్ షూట్ కి 5 నుంచి 10 కోట్లు డిమాండ్ చేస్తోందట ఈ సొట్టబుగ్గ సుందరి.
ఇటు సినిమాలు.. బ్రాండ్ అంబాసిడర్లు, యాడ్ షూట్ లు, ఇతర బిజినెస్ లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ కలిపి చూసుకుంటే భర్త రణ్ వీర్ సింగ్ కంటే ఎక్కువే సంపాదిస్తుందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాల్లో కలిసి నటించారు. అయితే.. ప్రస్తుతం దీపికా ప్రెగ్నెంట్. త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే.. వీరిద్దరూ త్వరలో డైవర్స్ తీసుకోబోతున్నారనే రూమర్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు పుకార్ల గురించి అయితే రణ్ వీర్ సింగ్, దీపికా ఎలాంటి కామెంట్ చేయలేదు. స్పందించలేదు. ఆ విషయం పక్కన పెడితే.. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తూ దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటోంది దీపికా.