Devara Collections:1stడే కళ్ళు చెదిరే కలెక్షన్స్.!

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా  బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా ది గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర.. ఆల్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్


Published Sep 28, 2024 07:23:26 AM
postImages/2024-09-28/1727488406_jrntr.jpg

న్యూస్ లైన్ డెస్క్:పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా  బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా ది గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర.. ఆల్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయి  అద్భుతమైన ఆదరణ పొందింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసినటువంటి సినిమా ఫ్యాన్స్ ను   ఆ రేంజ్ లోనే ఆనందపరిచింది.. అలాంటి దేవర మూవీ మొదటి రోజు కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొట్టిందట.  మొదటిరోజు ఈ చిత్రానికి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

ఈ మూవీ విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ల రికార్డుపై కన్నేసింది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో అర్ధరాత్రి ఒకటి గంటలకు స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 125 కోట్లకు పైగానే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఎక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా ఈ ఏడాది బాక్సాఫీస్ రికార్డుల్లో కల్కి మూవీ నిలిచింది. ఈ చిత్రంతో తీవ్ర పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

కల్కి మూవీ మొదటి రోజు 177.70 కోట్లు వసూలు చేసింది. ఇక దేవర మూవీ విషయానికి వస్తే ఆ విధమైన రికార్డును దాటడానికి ఎంతో ప్రయత్నం చేసినా అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సుమారు 75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసిందని, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ చిత్రానికి 60 నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని టాక్ వినిపిస్తోంది.  ఇక మొత్తంగా చూసుకుంటే 90 నుంచి 100 కోట్ల మధ్య వసూలు చేసినట్టు తెలుస్తోంది.

ప్రీమియర్ అమ్మకాలతో పాటుగా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం ఈ మూవీ 40 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడు అయ్యాయని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.  ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో సోలో హీరోగా చేసిన ఈ మూవీ ఈ విధమైన వసూలు చేయడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరింత ఊరటనిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నార్త్ లో  ఏడు కోట్ల వరకు వసూలు చేసిందని, అయితే ఈ వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara koratala-shiva devara-first-day-collections

Related Articles