ధనుష్ ను నువ్వు ఇంత దిగజారిపోతావ్ అనుకోలేదు అంటూ ఫుల్ ఫైర్ అయ్యింది. అసలు ఎందుకు ఇంత కోపం అంటే..
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరో ధనుష్ పై నయనతార మూడు పేజీల స్టోరీలను రాసుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ డాక్యుమెంటరీ అయిన నయనతార బియండ్ ది ఫెయిరీ టేల్ కు సంబంధించి చిన్న చిన్న గొడవలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. అయితే ఈ విషయంగా నయనతారకు ధనుష్ 10 కోట్లు లీగల్ నోటీసులు పంపాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా నయనతార ఫుల్ షాకింగ్ కామెంట్లు చేశారు. ధనుష్ ను నువ్వు ఇంత దిగజారిపోతావ్ అనుకోలేదు అంటూ ఫుల్ ఫైర్ అయ్యింది. అసలు ఎందుకు ఇంత కోపం అంటే..
నెట్ఫ్లిక్స్ ఓటీటీలో నయనతార బయోగ్రఫీకి సంబంధించిన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 18 నుంచి నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ను ఇటీవల రిలీజ్ చేశారు. అందులో నేను రౌడీనే మూవీ షూటింగ్ సమయంలో చిత్రీకరించిన 3 సెకన్ల వీడియోను వాడారు. అయితే ఆ మూడు సెకన్లు వీడియో పై కాపీ రైట్స్ అంటూ కేసు వేశాడు ధనుష్ . దీనికి గాను 10 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ లీగల్ నోటీసులు పంపాడు. దీంతో నయన్ కు మండింది. దీంతో పెద్ద పోస్ట్ వేసింది.
నేను రౌడీనే మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే, తన అనుమతి లేకుండా మూవీలోని క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీ రైట్స్ కోసం మూడు సెకన్లకు పదికోట్లా ఎందుకు ఇంత దిగజారుతున్నావ్. ఫ్యామిలీ వల్ల సినిమాల్లో ఎదిగావు...నేను ఎవ్వరు లేకుండా నా కష్టం మీద నేను బతికుతున్నా ..ఎదుగుతున్నా..నువ్వు దాన్ని ఓర్చుకోలేకపోతున్నావు. ఇలా కక్ష్య సాధింపు చెయ్యడం అసలు బాలేదంటు పోస్ట్ చేసింది. నా డాక్యుమెంటరీ కోసం చాలా మంది సినీ పెద్దలు సాయం చేశారు. జస్ట్ 3 సెకన్ల వీడియోకు నువ్వు డబ్బు డిమాండ్ చెయ్యడం నీ బుధ్ధి ని బయటపెడుతుంది.అందుకోసం నిన్ను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కలు చేసింది" అని నయనతార చెప్పింది.