2007లో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన తప్పిదమేఎకరానికి 71 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూరణ్ సింగ్ అనే రైతు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టు మెట్లెక్కారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కధే విన్నపుడే చాలా విచిత్రంగా ఉంది. కొన్నాండ్ల క్రితమే ఓ సాధారణ రైతు ఓ రైలుకు ఓనర్ అయ్యాడని తెలుసా ..అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు ఓ రైతు యజమానిగా ఉన్నాడు . ఎందుకు ..ఎలా జరిగిందనేది తెలుసుకుందాం.
పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకోవాలి. 2007లో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన తప్పిదమే ఇందుకు కారణం.లుథియానాలోని కటానా అనే గ్రామంలో భూసేకరణ కోసం రైతులకు ఎకరానికి పాతిక లక్షలు రూపాయిల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
కొన్నాళ్లకు తమ సమీప గ్రామంలో ఎకరానికి 71 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూరణ్ సింగ్ అనే రైతు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టు మెట్లెక్కారు. తమకు మరీ అంత తక్కువ ఇవ్వడం ఆయనకు నచ్చలేదు . సో తమకు మిగిలిన మొత్తం ఇప్పించాలని కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పుని ఇచ్చింది అయినా రైల్వే పెద్దగా పట్టించుకోలేదు.అప్పుడు కోర్టు స్వర్ణ శతాబ్ధి రైలును జప్తు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ తర్వాత ఆ ట్రైన్ కు ఓనర్ అయ్యాడు అది సాధారణ రైతు రైలుకు ఓనర్ అయ్యాడు అదీ సంగతి.