తమిళ్ , తెలుగులో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ లో అంతగా ఆడలేదు. ఫ్యాన్స్ కే కాదు ...సినిమా లవర్స్ కు ఎవ్వరికి అంతగా నచ్చలేదు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమా ను నిర్మించారు. సూర్య భారీ అంచనాలతో డ్యూయల్ రోల్ చేసిన సినిమా. అయితే ఈ మూవీ లో దిశాపటానీ హీరోయిన్ గా చేసింది. తమిళ్ , తెలుగులో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ లో అంతగా ఆడలేదు. ఫ్యాన్స్ కే కాదు ...సినిమా లవర్స్ కు ఎవ్వరికి అంతగా నచ్చలేదు.
'కంగువా'లో సూర్య లుక్ అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమైంది. అయితే సూర్య మోడ్రన్ లుక్ తో కూడిన పాత్రతో కథ మొదలు కావడం .. ఆ పాత్ర ఇంట్రడక్షన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఈ సినిమాలో ట్రైబల్ తెగల మధ్య పోరాటం , ఫారన్ వాళ్లు ఆశపెట్టిన బంగారు నాణాల కారణంగా మొదలవుతుంది. చాలా యేళ్ల క్రితం బంగారు నాణాల పై అసలైన అవగాహన ఉండేది కాదు. ఎలాంటి అవగాహన లేని ఆటవికులు , వాటి కోసం ఆశపడే అవకాశమే ఉండకపోవచ్చు. ఎందుకంటే వారికి అసలు బంగారు నాణాలు కాని వారితో వ్యాపారాలు కాని ఆ రోజుల్లో తెలీదు.
'కంగువా' తన జాతి కోసం పోరాడటం సరైనదిగానే కనిపిస్తుంది. కానీ ఒక తల్లికి మాట ఇచ్చానని చెప్పి 'కంగువా' ఆ పిల్లాడి వెంట చీకటికోనకి వెళ్లడంతో కథ పక్కదారి పడుతుంది. కంగువ ఓ తెగకి నాయకుడు. తిరుగులేని యుధ్ధవీరుడు ..కాని వారి తెగలో కంగువా మాట ఎవ్వరు వినరు. ఆ పాత్రకు అక్కడితే అంత పవర్ లేకుండా పోయింది. ఇక ప్రధానమైన పాత్రలు కూడ బలుక్కున్నట్టుగా పునర్జన్మను పొందడం అన్నిటికి మించిన హైలైట్టు. వారి చాలా యుధ్ధవీరుడు అన్నపుడే తన క్యారక్టర్ కు అసలు పెద్ద వెయిట్ లేకుండా అయిపోయింది. అక్కడే ఆడియన్స్ కు సినిమా మీద పెద్దగా హోప్స్ లేకుండా చేసేసింది.