అనుష్క , కొహ్లీ కూడా తన సెకండ్ ప్రెగ్నెన్సీని చాలా సీక్రెట్ గా ఉంచారు. అచ్చం అలాగే ఉంచాలనుకుంటున్నారంటున్నారు నెటిజన్లు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో సారి తండ్రి అయ్యాడు. తన భార్య రితికా సజ్జే హెల్దీ కొడుకుకు జన్మనిచ్చారు. అయితే ఈ వార్త సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే, రోహిత్ శర్మ - రితికా సజ్దే నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. అనుష్క , కొహ్లీ కూడా తన సెకండ్ ప్రెగ్నెన్సీని చాలా సీక్రెట్ గా ఉంచారు. అచ్చం అలాగే ఉంచాలనుకుంటున్నారంటున్నారు నెటిజన్లు.
ఈ జంట ముంబైలో శుక్రవారం (నవంబర్ 15) తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నందున జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లలేదు. అయితే, మొదటి మ్యాచ్‌కి ముందు మగబిడ్డ రాకతో నవంబర్ 22న ప్రారంభం కానున్న పెర్త్‌లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కాస్త ఆలస్యంగా వెళ్తాడని టాక్ కూడా నడుస్తుంది. నిజమే అయితే కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రోహిత్ శర్మ తన మేనేజర్ రితికా సజ్దేను డిసెంబర్ 13, 2015న వివాహం చేసుకున్నాడు. దీని తర్వాత, డిసెంబర్ 30, 2018న వారికి సమైరా అనే కుమార్తె జన్మించింది. సమైరా కు ఇప్పుడు 5 యేళ్లు ఇఫ్పుడు మరో బిడ్డకు జన్మనిచ్చింది రితికా .రితికా తరచుగా స్టాండ్స్‌లో కూర్చుని తన భర్త కోసం ఉత్సాహంగా ఉంటూ అతని కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. ప్రస్తుతం తన బేబీ పుట్టిన ఆనందంలో ఉన్నాడు రోహిత్ . తర్వాత క్రికెట్ ట్రోఫీ కోసం ఆలోచిస్తారంటున్నారు నెటిజన్లు .