Donald Trump: ‘‘డోనాల్డ్ ట్రంప్ ను చంపే ఆలోచనే లేదు..ఇరాన్ !


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది.


Published Nov 16, 2024 09:16:00 PM
postImages/2024-11-16/1731772035_httpcom.ft.imagepublish.uppprodeu.s3.amazonaws.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ అధికారంలోకి రావడాన్ని ఇరాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ట్రంప్ పై హత్యాయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో...ఫుల్ వైరల్ అవుతుంది. అయితే దీనికి క్లారిటీ ఇచ్చేసింది. అమెరికా ప్రభుత్వానికి ఇరాన్ హామీ ఇచ్చిందట.


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సీనియర్ దౌత్యవేత్తలు ఈ వారం ట్రంప్ సలహాదారు, బిలియనీర్ వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో నాలుగేళ్లు యూఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించే ట్రంప్ తో మంచి ర్యాపో నే కోరుకుంటామని అన్నారు. అమెరికా గతంలో చేసిన హెచ్చరికకు ప్రతిస్పందనగా అక్టోబర్ 14న స్విస్ దౌత్యవేత్తల ద్వారా ఈ సందేశాన్ని ఇరాన్ పంపించింది.


ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడాన్ని టెహ్రాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయన వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఇరాన్ భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్ తో అమెరికా అణు ఒప్పందాన్ని రద్దు చేశారు. అంతేకాదు ఇరాన్ పై తీవ్రమైన ఆర్ధిక ఆంక్షలు విధించాడు. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చాలని ఆదేశించాడు.   అప్పటి నుంచి ట్రంప్ పై కాస్త నెగిటివ్ టాక్ ఉంటుంది.అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు ట్రంప్ తో ఈ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.ఇరాన్ ప్రభుత్వ అధికారి ఒకరు ట్రంప్ ను హత్య చేయడం కోసం తనకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాడని ఇరాన్ కు చెందిన ఒక వ్యక్తి వెల్లడించాడు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america trump died

Related Articles