అప్పట్లో Sr.Ntr మీదికి చెప్పులు విసిరారా.. కారణం ఎవరంటే.?

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసార్వభముడు అనే పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇలాంటి ఈయన ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనాలు సృష్టించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలన నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే  పూర్తిస్థాయి అధికారంలోకి వచ్చారు. అంతేకాదు పేద ప్రజల కోసం ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అలా పార్టీని నడిపిస్తున్న తరుణంలోనే ఎన్టీఆర్ చేసిన కొన్ని తప్పుల వల్ల చివరికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ప్రజలు చెప్పులు విసిరేసే పరిస్థితి కూడా ఏర్పడింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-01/1719815821_sr.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసార్వభముడు అనే పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇలాంటి ఈయన ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనాలు సృష్టించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలన నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే  పూర్తిస్థాయి అధికారంలోకి వచ్చారు. అంతేకాదు పేద ప్రజల కోసం ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అలా పార్టీని నడిపిస్తున్న తరుణంలోనే ఎన్టీఆర్ చేసిన కొన్ని తప్పుల వల్ల చివరికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ప్రజలు చెప్పులు విసిరేసే పరిస్థితి కూడా ఏర్పడింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.

అయితే సీనియర్ ఎన్టీఆర్ గురించి మాజీ ఐపీఎస్ నరసయ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు బయట పెట్టారు..  అన్న ఎన్టీఆర్ భార్య బసవతారకం మరణించిన తర్వాత ఆయన లైఫ్ లోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చింది. నందమూరి కుటుంబీకులు ఎవరు కూడా ఆమెను ఒప్పుకోలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆమెను దగ్గర తీసుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. మరి అలా అని లక్ష్మీ సైలెంట్ గా ఇంట్లో ఉండకుండా, ఆయన రాజకీయ జీవితంలో కూడా వేలు పెట్టింది. చాలా విషయాల్లో కలగజేసుకొని  అనేక ఇబ్బందులు తీసుకువచ్చింది. అలా లక్ష్మీపార్వతి  సీనియర్ ఎన్టీఆర్ లైఫ్ లోకి రావడం వల్ల పార్టీ దెబ్బతింటూ వచ్చింది.  

ఇదే సమయంలో టిడిపి శ్రేణులు చంద్రబాబుకు, పార్టీని చేతుల్లోకి తీసుకోవాలని చెప్పారట. లేదంటే పార్టీ విచ్చిన్నమవుతుందని తెలుపుతూ చంద్రబాబుకు సపోర్ట్ చేశారట. ఇదే సమయంలో వైస్రాయ్ హోటల్లో తతంగమంతా నడిపిన తర్వాత ఎన్టీఆర్ మరియు లక్ష్మీపార్వతి అలా నడుచుకుంటూ వస్తుండగా కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు లక్ష్మీపార్వతిపై చెప్పులు విసిరారట. అది కాస్త  మిస్సై  సీనియర్ ఎన్టీఆర్ కు తగిలిందట. అయితే దీంతో ఎన్టీఆర్ పైన చెప్పులు విసిరాలని కొంతమంది రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ వాళ్ళు విసిరింది లక్ష్మీపార్వతిపై అని చాలామందికి తెలియదు.

newsline-whatsapp-channel
Tags : chandrababu tdp newslinetelugu sr-ntr laxmi-parvathi basavatarakam

Related Articles