Manchu Family: మంచు ఫ్యామిలీలో బయటపడ్డ అన్నదమ్ముల విభేదాలు.?

మంచు మోహన్ బాబు కి ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె.. వీరు ముగ్గురు కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలోని మనోజ్,విష్ణు మధ్య గొడవలు విభేదాలు తలెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా మౌనిక రెడ్డి మనోజ్ లకి పుట్టిన కూతురు పేరు మనోజ్ అనౌన్స్ చేశారు. తన కూతురి పేరు దేవసేన శోభ ఎం ఎం అని పెట్టారు.తన కూతురికి పేరు పెట్టిన ఫంక్షన్ లో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. కానీ మంచు విష్ణు విరాణిక దంపతులు మాత్రం రాలేదు.అలాగే మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో తన తల్లిదండ్రులుపేర్లతో పాటు తన అక్కపేరు కూడా ఉంది. అలాగే  మౌనిక రెడ్డి తోబుట్టువుల పేర్లు కూడా కనిపించాయి. కానీ మంచు విష్ణు పేరుగానీ ఆయన భార్య విరాణిక పేరు గాని కనిపించలేదు. దీంతో మంచు ఫ్యామిలీ లోని మనోజ్,విష్ణు మధ్య ఉన్న గొడవలు నిజమే అని మంచు మనోజ్ కూతురు దేవసేన సాక్షిగా ఈ గొడవలు బయటపడ్డాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-08/1720443002_manoj.jpg

న్యూస్ లైన్ డెస్క్: మంచు మోహన్ బాబు కి ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె.. వీరు ముగ్గురు కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే మంచు మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక తన ప్రియురాలు అయినటువంటి భూమా మౌనిక రెడ్డిని కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.అయితే భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదు.

కానీ కొడుకు ఇష్టం కాదనలేక మోహన్ బాబు ఆయన సతీమణి పెళ్లికి ఓకే చెప్పారు. కానీ మంచు విష్ణు ఆయన భార్య కి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు.అలాగే ఈ పెళ్లితో మంచు ఫ్యామిలీ లో గొడవలు ఒక్కసారిగా చెలరేగాయి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా గొడవలు పెరిగిపోయాయి. ఇక మంచు మనోజ్ పెళ్లికి విష్ణు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెళ్లయ్యాక ఓ రోజు మంచు విష్ణు గొడవ పెట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా మోహన్ బాబు వార్నింగ్ తో దాన్ని డిలీట్ చేశాడు.

ఈ వీడియో సాక్షిగా వీరిద్దరి మధ్య విభేదాలు నిజమే అని బయటపడ్డాయి. అలాగే వీరిద్దరి మధ్య గొడవలు నిజమే అని తాజాగా కూడా క్లారిటీ వచ్చింది.ఎందుకంటే తాజాగా మౌనిక రెడ్డి మనోజ్ లకి పుట్టిన కూతురు పేరు మనోజ్ అనౌన్స్ చేశారు. తన కూతురి పేరు దేవసేన శోభ ఎం ఎం అని పెట్టారు. అయితే ఈ పేరు కి అర్థం కూడా మనోజ్ ఒక లెటర్ పోస్ట్ చేస్తూ బయటపెట్టారు. దేవసేన అంటే ఆ శివుడి కొడుకు సుబ్రమణ్య స్వామి అయినటువంటి భార్య పేరు అలాగే శోభ అంటే మనోజ్ తల్లి దివంగత రాజకీయ నాయకురాలు శోభ నాగిరెడ్డి.. అయితే తన కూతురికి పేరు పెట్టిన ఫంక్షన్ లో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది.

కానీ మంచు విష్ణు విరాణిక దంపతులు మాత్రం రాలేదు.అలాగే మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో తన తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలాదేవిల పేర్లతో పాటు తన అక్క మంచు లక్ష్మి పేరు కూడా ఉంది. అలాగే భూమా మౌనిక రెడ్డి తోబుట్టువుల పేర్లు కూడా ఈ లెటర్లో కనిపించాయి. కానీ ఎక్కడా కూడా మంచు విష్ణు పేరుగానీ ఆయన భార్య విరాణిక పేరు గాని కనిపించలేదు. దీంతో మంచు ఫ్యామిలీ లోని మనోజ్,విష్ణు మధ్య ఉన్న గొడవలు నిజమే అని మంచు మనోజ్ కూతురు దేవసేన సాక్షిగా ఈ గొడవలు మరొకసారి బయటపడ్డాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manchu-manoj manchu-vishnu mohan-babu devasena-shobha-mm mounika-reddy

Related Articles