DIL:దిల్ మూవీ హీరోయిన్ గుర్తుందా..ఇప్పుడు చూస్తే వావ్ అంటారు.!

Published 2024-07-04 03:56:08

postImages/2024-07-03/1720016469_dilr.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో  సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  హీరో హీరోయిన్లకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు లేదంటే  వారు సినిమాలో నటించినటువంటి ఫోటోలు  ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.  కొంతమంది హీరో, హీరోయిన్లు కొన్ని సంవత్సరాలపాటు   ఇండస్ట్రీలో కొనసాగి  ఆ తర్వాత ఇండస్ట్రీని వదిలి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లిన వారు  కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఏదో ఒక తరుణంలో బయట కనిపిస్తూ ఉంటారు. ఆ టైంలో వారిని గుర్తుపట్టడం కష్టంగా మారుతుంది. ఇదే తరుణంలో వారు సినిమాల్లో నటించినప్పటి ఫోటోలు మరియు వారి లేటెస్ట్ ఫోటోలు జతచేసి వీరు ఎవరో గుర్తుపట్టారా అని టాస్కులు విసురుతుంటారు. ప్రస్తుతం అదే విధమైనటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.  ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, వివరాలు ఏంటో క్లియర్ గా చూసేద్దాం.

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలలో నితిన్ కూడా ఒకరు. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అలాంటి నితిన్ ఇండస్ట్రీలో అద్భుతమైన హిట్ సాధించిన మూవీ దిల్.  ఈ చిత్రాన్ని వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకున్నది. యువతకు మాత్రం ఈ మూవీ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. ఇందులో నితిన్ తో పాటు నేహా ప్రధాన పాత్ర చేసిందని చెప్పవచ్చు.  చిత్రానికి ఆర్పి పట్నాయక్ సంగీతం మరింత హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుకు మొదటిది.  ఫస్ట్ మూవీ తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈయనకు ఈ చిత్రం పేరే తన పేరు ముందు వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాతే ఆయన దిల్ రాజుగా మారిపోయారు. అలాంటి ఈ సూపర్ హిట్ మూవీలో నితిన్ సరసన నటించినటువంటి కథానాయక  నేహా. ఈమె దిల్ సినిమా తర్వాత దుబాయ్ శీను, ఒక సైన్యం,  బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో కనిపించింది.

అయితే ఇందులో దుబాయ్ శీను,  బొమ్మరిల్లు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. అలాంటి ముద్దుగుమ్మ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా నేహా  తన ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఆమె దిల్ సినిమా ఫోటోలు మరియు ప్రజెంట్ ఫోటోలు జత చేసి అప్పటికి ఇప్పటికీ నేహా ఎలా మారింది చూడండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి.