సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆగష్టు 7న 2024 పీటీ5 అనే ఈ గ్రహశకలాన్ని సైంటిస్టులు కనుగొన్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చందమామ రావే ..జాబిల్లి రావే ...అయ్యయ్యో ఎంత మంది తల్లులు ప్రేమగా పిలిచారో ..నిజంగా భూమ్మీదకు మరో చందమామ వచ్చేసింది. అసలు చందమామతో పాటు కొసరు చందమామ కూడా రాబోతుందంటున్నారు సైంటిస్టులు. జస్ట్ ఏదో హాలిడేస్ కి వచ్చినట్టు ఓ రెండు నెలలు భూమి చుట్టు తిరుగుతూ ఉంటుందట.ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆగష్టు 7న 2024 పీటీ5 అనే ఈ గ్రహశకలాన్ని సైంటిస్టులు కనుగొన్నారు.
ఈ గ్రహశకలం భూమి చుట్టు తిరుగుతూ ఉంటుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ చిట్టి చంద్రుడు భూమి చుట్టు తిరుగుతాడట.ఈ చిన్న చంద్రుడిని నేరుగా చూడలేం.. అంతేకాదు.. టెలిస్కోప్‌తో కూడా చూడలేమని అంటున్నారు. సైంటిస్టులకే సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఈ చిన్నపాటి చంద్రుడిగా వస్తున్న గ్రహశకలంపై అధ్యయనం చేయడం ద్వారా భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి వచ్చే వస్తువులపై (NEOs) ఎలా ప్రభావం చూపుతుంది అనేదానిపై సైంటిస్టులు మరింత పరిశోధించే అవకాశం కలుగుతుంది.
అసలు ఈ ఉల్క భూమి చుట్టు ఎందుకు తిరుగుతుందంటే అంతరిక్షంలో ఎక్కడో తిరుగుతున్న ఈ ఉల్కను మన భూమి తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టు తిరిగే కక్షలోకి లాగేసుకుంది. అంచనాల ప్రకారం ఈ ఉల్క జస్ట్ రెండు నెలలే భూమి చుట్టు తిరిగుతుంది.ముందు కూడా ఓ సారి ఈ మినీ మూన్ 2006 లో ఓ 365 రోజులు తిరిగింది. తర్వాత అలా సైడ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ వస్తుంది. అయితే ఇలానే ఓ సారి తిరిగి వెళ్లిపోయిన శకలం ఒకటి 2051 లో మరో సారి భూమ్మీదకు చేరుకుంటుందట.