రాత్రి ఆహరం తింటుండగా స్వల్ప ఘర్షణకు దిగాయి. ధనంజయ ఏనుగు, కంజన్ ఏనుగుపై దాడికి పాల్పడుతూ వెంబడించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్యాలస్ అంటేనే రిచ్ నెస్ , గ్రాండ్ , ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ మనకి తెలిసిందే. అయితే అన్ని ఏనుగులు ఉన్నదగ్గర గొడవలు కూడా జరుగుతుంటాయి. మైసూర్ ప్యాలస్ లో రెండు ఏనుగులు ఫుల్ కొట్టుకున్నాయి.ధనంజయ, కంజన్ అని పిలవబడే ఆ రెండు ఏనుగులు శుక్రవారం రాత్రి ఆహరం తింటుండగా స్వల్ప ఘర్షణకు దిగాయి. ధనంజయ ఏనుగు, కంజన్ ఏనుగుపై దాడికి పాల్పడుతూ వెంబడించింది.
మావటివాడు ఒక ఏనుగుపై ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆవేశంగా స్టీల్ బారికేడ్‌ని సైతం నెట్టేవేసి కోడి సోమేశ్వర ఆలయ ద్వారం నుంచి ప్రధాన రోడ్డు వైపు పరిగెత్తాయి. ఏకంగా జయమార్తాండ గేటు దగ్గర నుంచి మైసూర్ నంజన్ గూడ రోడ్డు వైపుకు దూసుకుపోయాయి. దేనికి కొట్టుకున్నాయో తెలీదు కాని దాదాపు ఏడు ఎనిమిది గంటలు కొట్టుకున్నాయి.
చిట్టచివరికి మధ్యరాత్రిలో మావటి ఎంతో కష్టపడి ధనంజయ ఏనుగును శాంతింపజేయడంతో అది వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. మరో ఏనుగు కంజన్ కూడా చల్లబడ్డడంతో మావటి, అటవీ అధికారులు తిరిగి వాటిని శిబిరాలకు తరలించారు. మావటిలు తమ చురుకైన సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏనుగులను అదుపులోకి తేవడంతో పరిస్థితి చక్కబడింది. దసరా రాబోతుంది ..ఏనుగుల పరిస్థితి ఇలా ఉండడం పై కన్నడ మీడియా గగ్గోలు పెట్టేస్తుంది.