Cholestral : ఒంట్లో కొవ్వు ఎంతుందో.. కంటిని చూసి చెప్పొచ్చట!

ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుల వద్దకు వెళ్తే ముందు కళ్లు పరీక్షించడం మనం చూస్తూనే ఉంటాం. అంటే.. మన శరీరంలో ఏం జరుగుతోందో కళ్లు చూసి చెప్పొచ్చన్నమాట.


Published Aug 09, 2024 05:32:43 PM
postImages/2024-08-09/1723204963_eyes.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రోజురోజుకు మారిపోతున్న లైఫ్ స్టైల్, ఛేంజ్ అవుతున్న ఆహార అలవాట్ల కారణంగా జనాల జీవన ప్రమాణం కూడా తగ్గిపోతోంది. చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న ఘటనలూ పెరుగుతున్నాయి. అసలు గుండెపోటుకు ప్రధాన శత్రువు అధిక కొవ్వు. శరీరంలో కొవ్వు ఎక్కువైతే మనకు తెలియకుండానే ఎన్నో రోగాలు పుట్టుకొస్తుంటాయి. హాస్పిటల్ కి వెళ్లకుండా మన శరీరంలో ఎంత కొవ్వుందో తెలుసుకునే సౌకర్యం లేదా? అంటే ఉందంటున్నారు నిపుణులు. అదేంటో మీరే స్టోరీ చదివి తెలుసుకోండి.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది తగ్గేందుకు కేవలం వైద్యులు సూచించే మందులు మాత్రమే వేసుకుంటే సరిపోదు. కాస్త వర్కవుట్స్ కూడా చేయాలి. శరీరంలో చెడు కొవ్వు పెరిగిపోయినప్పుడు ఒక రకమైన పదార్థం రక్తంలో కలుస్తుంది. ఇది ధమనుల్లో ఆగిపోయినప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే.. రక్త ప్రసరణకు ఆటంకం కలుగకుండా శరీరంలో చెడు కొవ్వు ఎంతుందో తెలుసుకోవాలంటే కండ్లు పరీక్షించుకుంటే చాలంటున్నారు వైద్యులు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుల వద్దకు వెళ్తే ముందు కళ్లు పరీక్షించడం మనం చూస్తూనే ఉంటాం. అంటే.. మన శరీరంలో ఏం జరుగుతోందో కళ్లు చూసి చెప్పొచ్చన్నమాట.

మన శరీరంలో అధిక కొవ్వు ఉన్నదంటే.. కంటిలోని కార్నియా చుట్టు తెల్లటి వలయం కనిపిస్తుంది. మామూలుగా ఇది వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని ఓర్కాస్ అంటారు. వయసులో ఉన్నప్పుడే కంటిలోని కార్నియా చుట్టు తెల్లటి వలయాలున్నట్టయితే శరీరంలో కొవ్వు ఉన్నట్టు అర్థం.

కళ్ల చుట్టూ అసాధారణంగా ఏవైనా గడ్డలు, లేదా తెల్లగా అనిపించినా, పసుపురంగులో చిన్నచిన్న గుల్లలు లాంటివి గమనించినా వెంటనే అప్రమత్తం కావాలి. ఈ సమస్యను శాంథెలాస్మా అంటారు. రక్తంలో కొవ్వు పెరిగిందనడానికి ఇదొక సంకేతం.

newsline-whatsapp-channel
Tags : health-news health health-benifits healthy-food-habits healthy- health-problems

Related Articles