Game Changer: 'గేమ్ ఛేంజ‌ర్' ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసిందంటే..!

రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ పడుతుందని భావించిన వారికి రామ్ చరణ్ హిట్ చాలా ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. 


Published Jan 11, 2025 11:32:00 AM
postImages/2025-01-11/1736575364_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్  చరణ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ ఫస్ట్ రోజు 186 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ టీం ప్రకటించింది.  "కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ థియేటర్‌లలో విడుదలైంది. గేమ్ ఛేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ సాధించింది. ఫ‌స్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్లకు పైగా వసూళ్లు రాబ‌ట్టింది" అని మేక‌ర్స్ ట్వీట్ చేశారు.   ఇది నిజంగా ఆనందంగా ఉందని రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ పడుతుందని భావించిన వారికి రామ్ చరణ్ హిట్ చాలా ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. 


ఇక ప్ర‌ముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో ద్వారా 1.3 మిలియ‌న్లకు పైగా టికెట్ల విక్ర‌యం జ‌రిగిన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. వీకెండ్ తో పాటు ...సంక్రాంతి సెలవులు కావడంతో టికెట్లు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. 


కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నంద‌న్‌, అప్ప‌న్న పాత్రల్లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ న‌టించిన‌ ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. తమిళ్ డైరక్టర్  కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ కామన్ స్టోరీ అయినా జనాల్లోకి బాగా వెళ్లింది. స‌ముద్ర‌ఖ‌ని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news shankar-director game-changer collections

Related Articles