రోజు గాంధీ పుట్టినరోజు.జాతిపితగా ఖ్యాతిగాంచిన గాంధీ ప్రపంచానికి శాంతి మార్గం చూపారు. అహింస ద్వారా కూడా యుద్దాన్ని గెలవొచ్చని నిరూపించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గాంధీ జయంతి అంటే సెలవు దినం అనుకునే రోజుల్లో ఉన్నాం. ఎందరో మహానుభావులు ...వారి వారి మార్గాల్లో ప్రయత్నిస్తే లభించిందే ఈ స్వతంత్ర్యం . ఈ రోజు గాంధీ పుట్టినరోజు.జాతిపితగా ఖ్యాతిగాంచిన గాంధీ ప్రపంచానికి శాంతి మార్గం చూపారు. అహింస ద్వారా కూడా యుద్దాన్ని గెలవొచ్చని నిరూపించారు.
1869 అక్టోబర్ 2న జన్మించిన గాంధిజీ జయంతి నేడు. ప్రపంచం మొత్తం గాంధీ సిధ్ధాంతాలను కొనియాడింది. ఆయన్ని శాంతి ధూత గా గుర్తించింది.ఆయన గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు కొన్ని సినిమాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గాంధీ జయంతి సంధర్భంగా వచ్చిన కొన్ని సూపర్ హిట్టు మూవీస్ ను చూసేద్దాం.
*GANDHI ( గాంధీ )
1982లో వచ్చిన 'గాంధీ' చిత్రంలో గాంధీగా హాలీవుడ్ నటుడు బెన్ కింగ్ స్లే గొప్పగా నటించారు. . బెన్ కింగ్ స్లే కి గాంధీజీ గెటప్ చక్కగా కుదిరింది. $ 22 మిలియన్స్ బడ్జెట్ తో నిర్మించారు. $127 మిలియన్ కి కలక్షన్లు వచ్చిన సినిమా..అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టు.
*THE MAKING OF MAHATMA( ది మేకింగ్ ఆఫ్ మహాత్మ)
ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనగల్ ది మేకింగ్ ఆఫ్ మహాత్మ చిత్రానికి దర్శకత్వం వహించారు. అసలు గాంధీ అహింసా మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారనేదే ఈ చిత్రం. సౌత్ ఆఫ్రికాలో తనకు ఎదురైన పరిస్థితులు అధ్భుతంగా ఉంటుంది సినిమా.
* HEY RAM (హే రామ్ )
ఇక 2000 సంవత్సరంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన చిత్రం హే రామ్. ఈ చిత్రం కమల్ హాసన్ రచించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన అద్భుతంగా ఉంటుంది. షారుక్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. సినిమా ఆడలేదు కాని ...మంచి సినిమా . కమల్ ఆస్తులు పోగొట్టిన సినిమా.
* LAGERAHO MUNNA BHAI( లగే రహో మున్నాభాయ్)
లగేరహో మున్నా భాయ్ అనే చిత్రం చేశారు. సంజయ్ దత్ హీరోగా నటించారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన లగేరహో మున్నాభాయ్ సూపర్ హిట్. అర్షద్ వార్సి కీలక రోల్ చేశాడు. విద్యాబాలన్ హీరోయిన్
*SHANKAR DADA JINDABAD( శంకర్ దాదా జిందాబాద్)
చిరంజీవి మహాత్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. శంకర్ దాదా జిందాబాద్ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. శ్రీకాంత్ కీలక రోల్ చేశాడు. కరిష్మా కొటక్ హీరోయిన్ గా నటించింది. 2007లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్... చిరంజీవి ఇమేజ్ రీత్యా తెలుగులో పరాజయం పాలైంది.
*MAHATHMA( మహాత్మ)
దర్శకుడు కృష్ణ వంశీ మహాత్మ టైటిల్ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించారు. శ్రీకాంత్ వందవ చిత్రంగా తెరకెక్కిన మహాత్మ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. కాని సినిమా చాలా బాగుంటుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన.. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ... సాంగ్ చాలా బాగుంటుంది. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం మరొక విశేషం.
ఈ సినిమా లు గాంధీ గొప్పతనాన్ని తెలుపుతూ రాసిన , తీసిన సినమాలు..కొన్ని హిట్టు , కొన్ని ఫ్లాపులు ..అయినా చూడాల్సిన సినిమాలు . గాంధీ తత్వం అర్ధమయ్యే సినిమాలివి.