ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 24 క్యారట్ల బంగారం ఇఫ్పుడు 80,600 వరకు ఉంది. కొన్ని నెలలు బంగారం మరింత పెరుగుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతుంది. గతేడాదిలో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 24 క్యారట్ల బంగారం ఇఫ్పుడు 80,600 వరకు ఉంది. కొన్ని నెలలు బంగారం మరింత పెరుగుతుంది.
ఇండియన్ బులియన్ అండ్ జువెలరీస్ అసోసియేషన్ (ఐబీజేఏ) డేటా ప్రకారం, గత దీపావళి (నవంబర్ 10) నుంచి ఇప్పటికి 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 నుంచి రూ.80,600 వరకు పెరిగింది. దాదపు 20 వేలు పెరిగింది. 24 క్యారెట్ బంగారం గ్రాము ధర రూ.7,825; అలాగే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము ధర రూ.7,637కు పెరిగింది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా వాడుతున్నారు.
బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అనేక జాతీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇలాంటి టైం లో మదుపరులు బంగారం మీదే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో - భవిష్యత్‌లో గోల్డ్ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి బంగారం వందకు వంద శాతం లక్ష దాటే అవకాశాలున్నాయంటున్నారు ఎనలిస్టులు. సో ఏ మాత్రం డబ్బులున్నా బంగారం పై పెట్టుబడి పెట్టండి.