డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అర్ధం పర్ధం లేకుండా మాట్లాడతారని విమర్శించారు. ఆయన మాట్లాడుతున్న విధానాన్ని, మాటలను భట్టి పునరాలోచన చేయాలని జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని చూసి పోటీకి వెళ్లి మాట్లాడితే.. ఉన్న ప్రతిష్ట కూడా పోతుందని హెచ్చరించారు.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రులకు సోయిలేదని మాజీ మంత్రి , సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల సుంకిశాల వద్ద రిటెయినింగ్ వాల్ కుప్పకూలిపోయిన ఘటనపై స్పందించారు.
సుంకిశాల ఘటన విషయంలో అతి చేయడం సరికాదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది చాలా చిన్న ఘటన మాత్రమే అని ఆయన అన్నారు. ఘటన జరిగి వారం రోజులైనా సోషల్ మీడియాలో చూసేవరకు నిజంగా తమకు కూడా తెలియదని అన్నారు. సుంకిశాల ఘటన వల్ల జరిగిన నష్టం చాలా తక్కువని.. అక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలపై జగదీష్ రెడ్డి స్పందించారు.
మంత్రులకు అవగాహన లేదని, ఈ విషయాన్ని BRS నేతలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో చూసే వరకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రికి విషయం తెలియదంటే రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎలా వుందో అర్థం అవుతోందని జగదీష్ రెడ్డి అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అర్ధం పర్ధం లేకుండా మాట్లాడతారని విమర్శించారు. ఆయన మాట్లాడుతున్న విధానాన్ని, మాటలను భట్టి పునరాలోచన చేయాలని జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని చూసి పోటీకి వెళ్లి మాట్లాడితే.. ఉన్న ప్రతిష్ట కూడా పోతుందని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నపుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా నోరుపారేసుకుంటున్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.