ప్రతీ నెల ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. బయోడైవర్సిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ డబల్ స్టాండర్డ్స్ మరోసారి బయటపడ్డాయని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బయోడైవర్సిటీ బోర్డు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంపై స్పందించిన హరీష్ రావు.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రతీ నెల ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. బయోడైవర్సిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
రూ. 10 కోట్ల నిధులు కేటాయించి సంవత్సరం గడుస్తున్నా జీతాలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారి శాస్త్రవేత్తలు సైతం క్యాబ్‌లు నడుపుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫీజులు కట్టలేక వారి పిల్లలు చదువు మానేసే దుస్థితి వచ్చిందని హరీష్ రావు తెలిపారు.
ఎప్పుడూ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని ఆయన అన్నారు. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బయోడైవర్సిటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులను ఆదుకోవాలని హరీష్ రావు సూచించారు.