జలయజ్ఞంలో EPC కాంట్రాక్ట్ పద్దతిని తీసుకొని వచ్చి ప్రాజెక్టుల ఆంచనా విలువలను పెంచేసి, నిబంధనలకు విరుద్దంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్‌లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుకొని రాష్ట్రాన్ని డెకాయిటీ చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకున్నది మీరు కాదా ఉత్తమ్ అని ఆయన నిలదీశారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటికి కూడా ప్రక్షాళన చేయాలని BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ డెకాయిట్ అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌ను అలా సంబోధించడం ఉత్తమ్ దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.
పేరుకే ఉత్తమ్ కానీ, మాట తీరు మాత్రం మూసీ ప్రవాహమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. జలయజ్ఞంలో EPC కాంట్రాక్ట్ పద్దతిని తీసుకొని వచ్చి ప్రాజెక్టుల ఆంచనా విలువలను పెంచేసి, నిబంధనలకు విరుద్దంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్‌లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుకొని రాష్ట్రాన్ని డెకాయిటీ చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకున్నది మీరు కాదా ఉత్తమ్ అని ఆయన నిలదీశారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా ఖర్చుని రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచిన విషయాన్ని మర్చిపోయారా అని హరీష్ రావు నిలదీశారు. తుమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రాతో ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టు పనులని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసి తలను వదిలేసి తోక దాకా ఏక కాలంలో పనులని ప్రారంభింపజేసి అడ్వాన్స్‌లు దండుకున్నది మీరు కాదా? అని గుర్తుచేశారు.
రాష్ట్రంలో BRS అధికారంలోకి వచ్చిన తర్వాత 16.42 శాతం వృద్ది రేటును సాధించి, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రా లాంటి పెద్ద వ్యవసాయ రాష్ట్రాలను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో తెలంగాణ నిలచిందని గుర్తుచేశారు. తెలంగాణలో 2014-15 లో పంటల సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు ఉంటే 2022-23 నాటికి అది 2.21 కోట్ల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు.
అంతేకాకుండా BRS హయాంలో కాళేశ్వరంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ళ, భక్తరామదాసు, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల, గూడెం తదితర ఎత్తిపోతల పథకాలను, సింగూర్ కాలువలు, కిన్నెరసాని కాలువలు, కొమురం భీం, నీలవాయి, గొల్లవాగు, మత్తడివాగు, ర్యాలివాగు, గడ్డెన్న సుద్దవాగు వంటి ప్రాజెక్టులతో సాగునీటి సరఫరా అనూహ్యంగా పెరిగిందని హరీష్ రావు గుర్తుచేశారు.