ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నంచి ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నంచి ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ బుధవారం వెల్లడించింది. 2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోగా.. రూ.2500 కోట్లు రావాల్సి ఉంది.
ఏపీలో కొత్తగా ఏర్పాడిన టీడీపీ ప్రభుత్వం రూ.160 కోట్లు చెల్లించినప్పటికీ.. ఆస్పత్రులకు రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేవంటూ అసోసియేషన్ తెలిపింది. నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో రూ. 15 వందల కోట్లు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు 8 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించకపోవడంతో ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి అవినాష్ ప్రకటనలో తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అటు ప్రైవేట్ వైద్య కాలేజీల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ మేరకు సేవలు కొనసాగించలేమని ప్రభుత్వానికి లేఖ రాసింది.