వాటితో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజు మీ శరీరంలో యూరిక్ యాసిడ్ అదుపులో ఉంచుకోవడానికి చెయ్యాల్సినవి ఏంటంటే..
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వయసు పెరిగే కొద్ది ఎన్నో అనారోగ్యసమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వీటిలో కీళ్లనొప్పులు కూడా ఒకటి. ఎప్పుడైతే శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ శాతం ఉంటుందో ఈ కీళ్లనొప్పులు వస్తుంటాయి. వాటితో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజు మీ శరీరంలో యూరిక్ యాసిడ్ అదుపులో ఉంచుకోవడానికి చెయ్యాల్సినవి ఏంటంటే..
యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో ఎక్కువ అవ్వడం వలన కిడ్నీలు ఫిల్టర్ చేయడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కువ శాతం ఉండడం వల్ల కిడ్నీల పనితీరు తగ్గి...అర్ధరైటిస్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యకు గిలోయ్ రసం లేదా ..గిలోయ్ టీ తప్పకుండా తీసుకోవాలి.
* గిలోయ్ తో పాటుగా గుగ్గుల్ కూడా ఎంతో సహాయపడతాయి అనే చెప్పవచ్చు.
* నేచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేసే గుగ్గులు కూడా బాగా పనిచేస్తాయి. అర్ధరైటిస్ వరకు రానివ్వకుండా జాగ్రత్త పడతాయి.
* సహజంగా చాలా మంది ప్రతిరోజూ అల్లం టీ ను తాగుతూ ఉంటారు. అయితే దానిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి.
* దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తో కూడా యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చు.
* దాల్చిన చెక్క టీ ని తాగడం వలన ఇన్సులిన్ సున్నితత్వం కూడా మెరుగుపడుతుంది.