ఆయన ఇల్లు పాండ్ స్థలంలో లేదని.. నోటీసులు అనేది పచ్చి అబద్దమని పలువురు చెబుతున్నారు. నిజంగానే నోటీసులు పంపించారని మరో వాదన వినిపిస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటిని లోటస్ పాండ్‌లోని చెరువు శిఖంలో జగన్ ఇల్లు ఉన్నట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారని వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకే వీలైనంత త్వరగా ఆ ఇంటిని కూల్చేయాలంటూ హైడ్రా నోటీసులు పంపించిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇల్లు పాండ్ స్థలంలో లేదని.. నోటీసులు అనేది పచ్చి అబద్దమని పలువురు చెబుతున్నారు. నిజంగానే నోటీసులు పంపించారని మరో వాదన వినిపిస్తోంది.
తాజగా, ఈ అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. జగన్‌కు నోటీసులు అనే అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయనకు పంపినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారామని తెలిపారు. దాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. హైడ్రా అటువంటి నోటీసులు పంపించదని.. అక్రమంగా నిర్మించారని తెలిస్తే వెంటనే కూల్చేస్తుందని రంగనాథ్ వెల్లడించారు.