హీరో రాజ్ తరుణ్ లావణ్య లైఫ్ కు సంబంధించినటువంటి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రకరకాల ట్విస్టులు అందిస్తూ దూసుకుపోతోంది. మొన్నటి వరకు రాజ్ తరుణ్ తో జీవిస్తాను రాజ్ తరుణ్ నాకు కావాలి.
న్యూస్ లైన్ డెస్క్: హీరో రాజ్ తరుణ్ లావణ్య లైఫ్ కు సంబంధించినటువంటి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇదే తరుణంలో రకరకాల ట్విస్టులు అందిస్తూ దూసుకుపోతోంది. మొన్నటి వరకు రాజ్ తరుణ్ తో జీవిస్తాను రాజ్ తరుణ్ నాకు కావాలి. మాల్వి మల్హోత్రా నుంచి ఆయన విడిపోవాలి అంటూ డిమాండ్ చేసినటువంటి లావణ్య మళ్లీ ప్లేట్ ఫిరాయించింది.
రాజ్ తరుణ్ నాకొద్దు అతనితో నేను జీవించలేను అంటూ చెప్పుకొస్తోంది. ఈ విధంగా రాజ్ తరుణ్ తో పది సంవత్సరాలు కలిసి ఉన్నానని, అతను నన్ను ప్రెగ్నెంట్ కూడా చేసి ఆ అబార్షన్ చేయించాడని ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చింది. అతను నాతో ఉంటే చాలు మళ్ళీ నాతో కలిసి వస్తే నేను ఆయనతో ఉంటానని జీవితాన్ని పంచుకుంటామని అన్నది.
ఈ విధంగా ఎన్నో ప్రగల్బాలు పలికినటువంటి లావణ్య చివరికి వచ్చేసరికి రాజ్ తరుణ్ అనేకమందితో రిలేషన్ ఉందని మాల్వితో కాకుండా అరియానా, హెబ్బా పటేల్, శాలిని పాండే వంటి వారితో రిలేషన్ ఉందని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో కూడా కొంత హీరోయిన్లతో కలిసి ఉన్న ఫోటోలు లిక్ చేసింది..ఈ విధంగా ఉన్నటువంటి లావణ్య తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
రాజ్ తరుణ్ నాకొద్దని ఇంతమందితో తిరిగినా ఆయన నాకు ఇంకా అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఆయనకు శిక్ష పడడమే నాకు కావాలని, త్వరలోనే రాజ్ తరుణ్ ను జైలుకు పంపిస్తానని అంటోంది. ఈ విధంగా రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతుంది. ఈ వివాదం వల్ల రాజ్ తరుణ్ ఏమైనా ఇబ్బంది వస్తుందా లేదంటే సైలెంట్ అవుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.